మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో మ్యూజిక్ వింటే మంచిదేనా..!
By సుభాష్ Published on 3 Jun 2020 2:35 PM ISTఎంత టెన్షన్‌లో ఉన్నా.. మంచి మ్యూజిక్ వింటు ఎంతో రిలాక్సేషన్ ఉంటుంది. ఒత్తిళ్ల నుంచి బయటపడొచ్చు. టెన్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో మంచి మ్యూజిక్ వింటే మంచిదంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకూ తల్లి ప్రతిక్షణ బిడ్డ గురించే ఆలోచిస్తుంటుంది. పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుంది... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని .. ఇలా రకరకాలుగా తల్లి ఆలోచిస్తుంటుంది. ఇక డెలివరీ సమయం దగ్గర పడుతున్నకొద్ది రకరకాలుగా భయాందోళన చెందుతారు. ప్రశాంతతను కోల్పోతారు. అలాంటి సమయాల్లో మ్యూజిక్‌ను వినొచ్చంటున్నారు నిపుణులు.
బిడ్డ కడుపులో ఉండగా మెడిటేషన్ చాలా మంచిది
ఇక బిడ్డ కడుపులో ఉన్న సమయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే మెడిటేషన్ చాలా మంచిదంటున్నారు. అందుకే ఆ సమయంలో ఇష్టమైన పాటలు వినడం, మెడిటేషన్‌కు సంబంధించిన మ్యూజిక్ వాడటం, ఇంట్లోనే నిశబ్ధంగా ఉన్న స్థలంలో ఇష్టమైన సంగీతాన్ని వినడం వల్ల ఒత్తిడి దరిచేరకుండా ఉంటుంది. సాధారణంగా ఒత్తిడి ఉన్న సమయంలో ఇష్టమైన మ్యూజిక్ వింటే చాలు. అప్పటి వరకూ ఉన్న టెన్షన్ ఒక్కసారిగా వెళ్లిపోతుంది. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో మ్యూజిక్ వినడం మంచిదని చెబుతున్నారు. ఇలా మ్యూజిక్ వినడం వల్ల తల్లి, బిడ్డకు మంచిదంటున్నారు. అలాగే మ్యూజిక్ వినే మందు మెలోడీ మ్యూజిక్, ఆహ్లాదాన్ని పంచే మ్యూజిక్ వినాలంటున్నారు. అంతేకాకుండా ఓంకారం, ధ్యానం వంటి మ్యూజిక్ వినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇయర్ ఫోన్స్‌తో మ్యూజిక్ వినొద్దు..
అయితే ప్రెగ్నెన్సీ సమయంలో మ్యూజిక్ వినడం మంచిదే కానీ.. ఇయర్ ఫోన్ పెట్టుకుని వినకూడదంటున్నారు. ఇయర్స్ ఫోన్ పెట్టుకుని మ్యూజిక్ వినడం మంచిది ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారి శరీరం సున్నితంగా మారుతుంది, అందుకే ఇయర్స్ ఫోన్ పెట్టుకోవడం అంత మంచిది కాదంటున్నారు.