జగిత్యాల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది డ్యాన్సులు

శుక్రవారం నాడు సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా జిల్లా ఆసుపత్రిలో డ్యాన్స్ చేశారు. నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు ఇప్పుడు ఎంక్వైరీ ఎదుర్కొంటున్నారు.

By Kalasani Durgapraveen  Published on  14 Dec 2024 7:06 AM GMT
జగిత్యాల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది డ్యాన్సులు

శుక్రవారం నాడు సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా జిల్లా ఆసుపత్రిలో డ్యాన్స్ చేశారు. నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు ఇప్పుడు ఎంక్వైరీ ఎదుర్కొంటున్నారు. విధులను పక్కనబెట్టి, రోగుల వార్డు సమీపంలో సిబ్బంది డ్యాన్స్ చేసింది. మీడియా ప్రతినిధుల రాకను గమనించి ఆగిపోయారు. సిబ్బంది అభ్యర్థన మేరకు రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ సుమన్ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది.

విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఆస్పత్రికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆర్‌ఎంఓ అనుమతి ఇచ్చారని నర్సులు చెప్పారు. పని లేదనే సాకుతో విధుల్లో ఉండగా నృత్యాలు చేయడం సరికాదన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Next Story