అవార్డ్ స్వీక‌రించేందుకు స్టైలిష్ లుక్‌లో వ‌చ్చి అందరి దృష్టిని ఆకర్షించిన అంబానీ కూతురు

ఇషా అంబానీ బిజినెస్‌తో పాటు స్టైల్‌ స్టేట్‌మెంట్‌లో ఎవరికీ తక్కువ కాదు. ఆమె తరచుగా హై ప్రొఫైల్ పార్టీలకు చక్కని దుస్తులు ధరించి హాజ‌ర‌వుతూ ఉంటుంది.

By Kalasani Durgapraveen  Published on  21 Oct 2024 12:39 PM IST
అవార్డ్ స్వీక‌రించేందుకు స్టైలిష్ లుక్‌లో వ‌చ్చి అందరి దృష్టిని ఆకర్షించిన అంబానీ కూతురు

ఇషా అంబానీ బిజినెస్‌తో పాటు స్టైల్‌ స్టేట్‌మెంట్‌లో ఎవరికీ తక్కువ కాదు. ఆమె తరచుగా హై ప్రొఫైల్ పార్టీలకు చక్కని దుస్తులు ధరించి హాజ‌ర‌వుతూ ఉంటుంది. బాలీవుడ్ నటీమణులతో పాటు ఇషా అంబానీ ఫ్యాషన్ సెన్స్ గురించి కూడా ఎప్ప‌టినుంచో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇటీవల ముంబైలో జరిగిన హార్పర్స్ బజార్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2024లో ఇషా అంబానీ ప్రతిష్టాత్మక ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. చలనచిత్ర, టెలివిజన్, కళ, సంస్కృతి, సాహిత్య ప్రపంచంలోని స్ఫూర్తిదాయకమైన మహిళలను సన్మానించడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ఇషా అంబానీతో పాటు షారుఖ్ ఖాన్ భార్య గౌరీ కూడా కనిపించింది. ఇంకా అన‌న్య‌ పాండే, కృతి సనన్ వంటి తారలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇషా అంబానీని సన్మానించారు. ఇషా వేదికపైకి రాగానే అందరి దృష్టి ఆమె దుస్తులపై పడింది, అందులో ఆమె చాలా అందంగా కనిపించింది.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఇషా.. షియాపరెల్లి డిజైన్ చేసిన దుస్తులను ధరించింది. ఆ డ్రెస్‌ చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఆమె తెలుపు, నలుపు రంగు కలయికతో కూడిన దుస్తులను ధరించింది. ఆమె తన దుస్తులకు లైట్‌ మేకప్, సింపుల్‌ ఆభరణాలను జోడించి క్లాసీ, ట్రెండీ లుక్‌తో అద‌ర‌గొట్టింది. ఈ స్టైల్ స్టేట్‌మెంట్‌తో బి-టౌన్ స్టార్లలో కూడా తన ఫ్యాషన్ సెన్స్‌ ఎవరికీ తక్కువ కాదని ఇషా మరోసారి నిరూపించింది. ప్ర‌స్తుతం ఇషా పోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.


Next Story