హోలీకి నేచురల్‌ కలర్స్‌ కావాలా..? ఇంట్లోనే రెడీ చేసుకోండిలా..!

హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కేరింతలతో సందడిగా జరుపుకొంటారు.

By Srikanth Gundamalla  Published on  22 March 2024 12:42 PM IST
holi, festival,  natural colours,

హోలీకి నేచురల్‌ కలర్స్‌ కావాలా..? ఇంట్లోనే రెడీ చేసుకోండిలా..!

హోలీ పండుగ అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం ఉంటుంది. రంగుల పండుగ ఇది. కలర్లను ఎదుటివారిపై జల్లుతూ ఆడుతూ.. పాడుతూ గడిపేస్తారు. పల్లె.. పట్నం అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ పండుగ చిహ్నం.. రాధాకృష్ణుల ప్రేమకు ప్రతిరూపంగా రంగులతో వాకిళ్లు, ఆలయాల ముంగిళ్లు రంగులతో నింపి పండగ చేసుకుంటారు. అయితే.. ఒకప్పుడు ప్రకృతి నుంచి వచ్చే రంగులతోనే ఈ వేడుకను జరుపుకొనే వారు. కాలక్రమంలో నేచురల్‌ కలర్స్‌ని మర్చిపోయి.. ఈజీగా దొరుకుతున్న రసాయన సింథటిక్ కలర్స్‌ను వాడుతున్నారు.

రసాయనాలతో తయారయ్యే సింథటిక్ కలర్స్‌తో ఎన్నో నష్టాలు ఉన్నాయి. పర్యావరణానికి ఈ రంగులు మంచివి కాదు. అలాగే చర్మం... కంటికి.. హెయిర్‌కి ఇలా ప్రతిదానికి వీటి వల్ల నష్టమే ఉంటుంది. ప్రజలకు వీటి గురించి తెలిసినా రసాయనాలతో తయారయ్యే కలర్స్‌ను వాడటం మానలేదు. ఇక చాలా వరకు నేచురల్‌గా కలర్స్‌ను ఎలా తయరు చేసుకోవాలో తెలియకపోవడం వల్ల కూడా ఇది జరుగుతోంది. అయితే.. ఇంట్లోనే నేచురల్‌ కలర్స్‌ను ఎలా తయారు చేయాలో ఓసారి చూద్దాం.

పింక్‌ కలర్‌ను ఇలా తయారు చేసుకోండి..

పింక్‌ గులాల్‌ కోసం 1 నుంచి 2 మీడియం సైజులో ఉన్న బీట్‌రూట్‌లను తీసుకోవాలని. వాటిని తరుముకుని.. దాంట్లో ఒక కప్పు నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఆ లిక్విడ్‌ను వడకట్టుకోవాలి. దీంట్లో ఒక టేబుల్‌ స్పూన్‌ రోజ్‌ వాటర్‌ను కూడా కలుపుకోవచ్చు. మొక్కజొన్న పిండి లేదా టాల్కమ్‌ పౌడర్‌ను వాడొచ్చు. ఒకవేళ పొడిగా పింక్‌ కలర్‌ కావాలనుకుంటే మైక్రోవేవ్‌లో వేడి చేయాలి. బాగా కలిపినా లేదా మళ్లీ గ్రైండ్‌ చేసినా పింక్‌ కలర్‌ రెడీ అవుతుంది.

నేచురల్ పింక్‌ కలర్‌ గులాల్

గులాల్‌ను ఇంట్లో తయారు చేసుకోవాడానికి గులాబీ రేకులను తీసుకోవాలి.. వాటిని నీటిలో గంట సమయం నానబెట్టాలి. ఆ తర్వాత మెత్తగా రుబ్బాలి. తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి మెత్తగా రుబ్బాలి. పొడి కావాలంటే ఎండబెట్టుకోవచ్చు. లేదా మైక్రోవేవ్‌లో ఉంచి పొడిగా కూడా చేసుకోవచ్చు.

నేచురల్‌ పసుపు కలర్‌

పసుపు పొడి ఇంట్లోనే పసుపు రంగును తయారు చేయవచ్చు. పసుపు రంగులో ఉండే శనగపిండి, పసుపు మిశ్రమంతో ఇంట్లోనే పసుపు కలర్‌ను తయారు చేసుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. పసుపు, శనగపిండి సున్ని పిండిలాగా కూడా ఉపయోగపడుతుంది. వీటినే నిటిలో కలిపే తడి రంగును తయారు చేయవచ్చు. అంతేకాదు..పసుపు బంతి పువ్వులను నీటిలో మరిగించినా నేచురల్‌ పసుపు కలర్‌ రెడీ అవుతుంది.

నేచురల్ గ్రీన్ కలర్

చాలా మంది ఇళ్ల పెరట్లలో గోరింటాకు ఉంటుంది. గోరింటాకు పొడితో గ్రీన్ కలర్ తయారు చేయొచ్చు. అప్పటికప్పుడు దీన్ని కడిగేస్తారు కాబట్టి పెద్దగా పండదు కూడా. అంతేకాదు.. పుదీనా, బచ్చలికూర లాంటి ఆకుకూరలు వేప, తులసి వంటి ఆకులను నీటిలో ఉడకబెట్టడం ద్వారా కూడా ఆకుచ్చ రంగును ఇంట్లోనే నేచురల్‌గా రెడీ చేసుకోవచ్చు.

నేచురల్‌గా ఆరెంజ్‌ కలర్ తయారీ

ఎండిన నారింజ తొక్కలను ఉపయోగించి క్షణాల్లోనే ఆరెంజ్‌ కలర్‌ను రెడీ చేయొచ్చు. తొక్కలను ఎండబెట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత మొక్కజొన్న పిండి.. కొద్దిగా పసుపు వేసి బాగా కలిపితే ఆరెంజ్‌ కలర్‌ మిశ్రమం తయారు అవుతుంది.

వీటితో పాటు మరిన్ని రంగులను కూడా ప్రకృతి సహజ సిద్ధంగానే తయారు చేసుకోవచ్చు.

Next Story