కిచెన్‌లో స్టవ్‌ పక్కనే ఆయిల్‌ పెడుతున్నారా? ఇది తెలుసుకోండి..

కిచెన్‌లో వస్తువులను చాలా మంది అందుబాటులో ఉండాలనీ.. వంట చేస్తున్న సమయంలో ఈజీగా దొరకాలని దగ్గరగా పెట్టుకుంటారు.

By Srikanth Gundamalla  Published on  9 Jun 2024 11:43 AM GMT
oil bottle,  stove, health,

కిచెన్‌లో స్టవ్‌ పక్కనే ఆయిల్‌ పెడుతున్నారా? ఇది తెలుసుకోండి.. 

కిచెన్‌లో వస్తువులను చాలా మంది అందుబాటులో ఉండాలనీ.. వంట చేస్తున్న సమయంలో ఈజీగా దొరకాలని దగ్గరగా పెట్టుకుంటారు. అన్నీ దాదాపుగా స్టవ్‌ చుట్టే ఉంటాయి. ఇక కూరల్లో కచ్చితంగా కావాల్సిన ఆయిల్‌ను కూడా స్టవ్‌కి దగ్గరగానే ఉంచుకుంటున్నారు. ఇలాంటి వారిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టవ్‌కి దగ్గరగా ఉంచడం వల్ల ప్రమాదమని చెబుతున్నారు. ఎందుకలాగా ఒకసారి తెలుసుకుందాం..

ఆఫీసులకు వెళ్లేవారు.. ఇంట్లో ఇతర పనులు ఉన్న వారు ఇలా పోపు డబ్బాలు.. మసాలలు, పసుపు, ఆయిల్‌ సహా ఇతర వస్తువులను దగ్గరగా ఉంచుతారు. స్టవ్‌ దగ్గర వాటిని నీట్‌గా అమర్చుకున్నా మంచిది కాదని అంటున్నారు. ఈ విషయం ఒక అధ్యయనంలో తేలిందని చెబుతున్నారు. స్టవ్‌కి దగ్గరగా ముఖ్యంగా ఆయిల్‌ను ఉంచడం ద్వారా ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని అధ్యయనంలో తేలింది. అంతేకాదు.. నూనె బాటిల్‌పై మూతను తెరిచి ఉంచడం వల్ల కొవ్వు పదార్థాలు క్షీణించి.. రుచి కూడా మారుతుందని అంటున్నారు. దాంతో.. నూనె దుర్వాసన కూడా వస్తుందట. ఆయిల్‌ సీసాలను స్టవ్‌ వద్ద పెట్టుకుంటే దానికి వేడి తగిలి అందులోని ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతం అవుతుందని అధ్యయనంలో తేలింది. దీని వల్ల వ్యాధులు వస్తాయని అంటున్నారు నిపుణులు.

ఆయిల్‌ను మరి ఎక్కడుంచాలి..?

ఆయిల్‌ బాటిల్‌న స్టవ్‌ పక్కన కాకుండా.. గాలి, వెలుతురు సరిగ్గా తగిలే చోట ఉంచాలని వెల్లడించారు. దానిపై మూతను గట్టిగా పెట్టి ఉంచాలట. గాలి ఏమాత్రం లోపలికి తగలకుండా చూసుకోవాలని అంటున్నారు. వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడితో ఊబకాయం, జీర్ణ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. త్వరగా వృద్ధాప్యం బారిన పడే అవకాశాలూ ఉన్నాయని చెప్పారు. ఇక ఆరోగ్యంగా ఉండాలని అనుకునే వారు ఆయిల్‌ పట్ల ఈ నిబంధనలను పాటిస్తే సంతోషంగా ఉంటారు.

Next Story