జిమ్, డైటింగ్‌లు లేవు.. 10 నెలల్లో 23 కిలోలు తగ్గిన వ్యాపారవేత్త
లైఫ్ స్టైల్ మారిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది ఉభయకాయంతో బాధపడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 25 Jun 2024 10:54 AM ISTజిమ్, డైటింగ్‌లు లేవు.. 10 నెలల్లో 23 కిలోలు తగ్గిన వ్యాపారవేత్త
లైఫ్ స్టైల్ మారిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది ఉభయకాయంతో బాధపడుతున్నారు. సరిగా నిద్రలేకపోవడం, నాణ్యత లేని ఆహారాన్ని విచ్చవిడిగా తినడం వంటివి చేయడం వల్ల ఉభకాయం వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లి నలుగురిలో తిరగాలన్నా ఇబ్బందిగా ఫీలవుతున్నారు. అయితే.. వచ్చిన పొట్టను తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు జిమ్‌లకు వెళ్తుంటే.. ఇంకొందరు యోగా.. డైటింగ్ అంటూ మితంగా ఆహారాన్ని తింటూ ఉన్నారు. ఇంకొందరైతే త్వరగా రిజల్ట్ రావడం కోసం ఇంజెక్షన్లు తీసుకోవడం, మందులు వాడటం చేస్తున్నారు. ఈ క్రమంలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కొత్త సమస్యల్లో చిక్కుకుంటున్నారు. అయితే.. తాజాగా ఓ వ్యాపారవేత్త ఇలాంటివి ఏవీ లేకుండానే కేవలం 10 నెలల కాలంలో 23 కిలోలు తగ్గాడు. అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఇతనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన నీరజ్ అనే వ్యాపారి ఈ రికార్డు వెయిట్ తగ్గి చూపించాడు. పది నెలల క్రితం 91.9 కిలోలు ఉన్నాడు. ప్రస్తుతం అతను 68.7 కిలోలకు తగ్గాడు. బరువు తగ్గాలి అనుకునేవారికి ప్రేరణగా మారాడు. నీరజ్ పది నెలల్లో 23 కిలోలు తగ్గినట్లు ఫిట్‌నెస్ కన్సల్టెంట్ సాటేజ్ గోహెల్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. జిమ్, ఫ్యాన్సీ డైట్ లాంటివి ఏమీ లేకుండా సాధారణంగానే బరువు తగ్గినట్లు చెప్పారు. అంతేకాకుండా నీరజ్ బరువు తగ్గకముందు, తగ్గిన తర్వాత ఫోటోలను కూడా అతను షేర్ చేశాడు. గుజరాతీ ఇంటి వంటను తింటూనే ఇంట్లో వర్కౌట్లు చేస్తూ మారిపోయాడు అంటూ సాటేజ్ గోహెల్ చెప్పాడు.
నీరజ్ రోజుకు 10వేల అడుగులు నడిచాడనీ.. ఇదే అతను బరువు తగ్గడానికి కారణమని తెలిపాడు. నీరజ్ బిజినెస్ మ్యాన్ కావడంతో బిజీ షెడ్యూల్ ఉంటుందనీ.. మొదట్లో 10వేల అడుగులు నడవడం కూడా కుదరలేదని చెప్పాడు. కానీ.. క్రమక్రమంగా దాన్ని పెంచి కచ్చితం 10వేల అడుగులు నడిచేలా చూసుకున్నాడని సాటేజ్ గోహెల్ చెప్పాడు. దాన్ని రోజువారీ లైఫ్‌లో భాగం చేసుకున్నాడని వెల్లడించాడు. గతంలో జిమ్‌కు వెళ్లిన అనుభవం కూడా నీరజ్‌కు లేదనీ.. దాంతో అతను జిమ్‌కు వెళ్లేందుకు నిరాకరించినట్లు తెలిపాడు. ఎక్కువ సేపు నడవడంతో పాటు రెండు డంబెల్స్‌తో ఇంటి వద్దే ఎక్సర్‌సైజ్ చేయాలని తాను నీరజ్‌తో చెప్ఇనట్లు సాటేజ్ గోహెల్ చెప్పాడు. మాంసాహారాన్ని పక్కన పెట్టి.. పన్నీర్, సోయా, ఎయ్యి, పప్పులు ఉండేలా చూసుకున్నట్లు తెలిపాడు. చక్కెరను పూర్తిగా తగ్గించాడని గోహెల్ వెల్లడించాడు. ఇక పది నెలల్లో పూర్తి రిజల్ట్ కనిపించిందని.. 23 కిలోలు తగ్గిన నీరజ్‌ను చూస్తున్నాం అంటూ సాటేజ్ గోహెల్ చెప్పాడు.