ఏలియన్లు నాకు టెలీపతీ ద్వారా ఫోటోలను పంపారు.!

American Woman Says She Met Aliens. సైన్స్ ఫిక్షన్ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ అవతార్‌లో కనిపించిన జీవి లాంటి నీలిరంగు ఏలియన్‌తో తనకు అనుబంధం ఏర్పడిందని

By M.S.R  Published on  7 March 2022 2:48 PM IST
ఏలియన్లు నాకు టెలీపతీ ద్వారా ఫోటోలను పంపారు.!

సైన్స్ ఫిక్షన్ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ అవతార్‌లో కనిపించిన జీవి లాంటి నీలిరంగు ఏలియన్‌తో తనకు అనుబంధం ఏర్పడిందని ఒక అమెరికన్ మహిళ తెలిపింది. అమెరికాలోని సెయింట్ లూయిస్, మిస్సౌరీలో నివసిస్తున్న లిల్లీ నోవా, కోవిడ్‌-19 లాక్‌డౌన్ సమయంలో ఆస్ట్రోఫోటోగ్రఫీని ఒక అభిరుచిగా ప్రారంభించిన తర్వాత 2020 చివరిలో తనకు ఏలియన్స్ తో మొదటిసారి అనుబంధం కలిగిందని చెప్పినట్లుగా ది మిర్రర్ నివేదించింది. లిల్లీ రాత్రిపూట స్వచ్ఛమైన గాలి కోసం బయటకు వెళ్లిందట.. ఆ సమయంలో తనకు ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతి కనిపించినట్లు తెలిపింది. అది సాధారణ విమానం కాదని, యూఎఫ్‌వో అని లిల్లీ గ్రహించింది.

కొన్ని నెలల తర్వాత తనకు మరోసారి ఏలియన్స్ కనిపించారని, ఆ తర్వాత చాలా తరచుగా ఏలియన్స్ తో సంబంధాలు ఏర్పడ్డాయని తెలిపింది. లిల్లీ తనకు ఇప్పుడు ప్రతిరోజూ గ్రహాంతరవాసులతో కమ్యూనికేషన్ జరుగుతోందని తెలిపారు. ఇతర గ్రహాల నుండి గ్రహాంతరవాసుల వంటి జీవులను చూశానని పేర్కొంది. "నేను చూసిన మొదటి ఏలియన్స్ లో లేత నీలం రంగు చర్మం ఉన్న అమ్మాయి ఉందని. ఆమెకు జుట్టు లేదు, కానీ ఆమె చాలా అందంగా ఉంది, "అని తెలిపింది. మెరుస్తున్న చర్మం, ప్రకాశవంతమైన నీలి కళ్ళతో మరిన్ని జీవులను తాను చూశానని చెప్పింది. గ్రహాంతరవాసులు ఇప్పుడు టెలిపతి ద్వారా తమ చిత్రాలను తనకు పంపుతున్నారని లిల్లీ చెప్పింది. ఏలియన్స్ తో తన ఎన్కౌంటర్ వలన చాలా అందమైన, సానుకూల అనుభవాలు అందాయని తెలిపింది.

Next Story