కోవిడ్‌ -19 వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఐక్యంగా పోరాడాలని తెలంగాణ గవర్నర్‌ తమిళసైని సౌందర్యరాజన్‌ పిలుపునిచ్చారు. ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజ్‌కు బెస్ట్‌ మెడికల్‌ కాలేజ్‌గా అవార్డు వచ్చింది. ఈసందర్భంగా సోమవారం సనత్‌నగర్‌లోని ఆస్పత్రిని ఆమె సందర్శించారు. ఈసందర్భంగా ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజ్‌, హాస్పిటల్‌ సిబ్బంకి అభినందనలు తెలిపారు. వారి సేవలను కొనియాడారు. మెడికల్‌ సిస్టంతో పాటు, మెడికల్‌ కాలేజ్‌లో వసతులు ఏర్పాటు చేసిన డీఆర్‌డీవోకు అభినందనలు తెలిపారు. కోవిడ్‌ -19 ఇప్పుడు మన ముందున్న సవాల్‌ అని ఆమె అన్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో వైద్యులసేవలు అమోఘమని, అందరి నుంచి వందనం అందుకునే జవాన్లు కూడా వైద్యులకు సెల్యూట్‌ చేస్తున్నారని అన్నారు. వైద్యులకు తోడుగా ప్రతీ ఒక్కరూ కలిసి పోరాడాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

Also Red : భార‌త్‌లో క‌రోనా ఉగ్ర‌రూపం.. 24 గంట‌ల్లో 4213 కేసులు

కోవిడ్‌ -19 నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని అన్నారు. ఇప్పుడు మనం పాటిస్తున్న శుభ్రత చర్యలు మన ఆచారంలో అనాదిగా ఉన్నాయని, భారత్‌లో పాటిస్తున్న సంప్రదాయాలే మనకు రక్షణగా నిలుస్తున్నాయని గవర్నర్‌ అన్నారు. ప్రంచంలోనే అతి పెద్ద బీమా పథకాన్ని కేంద్రం అమలు చేస్తుందని తెలిపారు. సాధారణ రోగులకు ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలని గవర్నర్‌ సూచించారు. సెక్యూరిటీ దగ్గర నుండి వైద్యులు, మెడికల్‌ స్టాప్‌, టెక్నీషియన్స్‌ వరకు ఈ పరిస్థితులను దైర్యంగా ఎదుర్కొంటున్నారని అన్నారు. కోవిడ్‌ 19ను ప్రపంచంలోని దేశాల కంటే భారతదేశం చాలా ధైర్యంగా ఎదుర్కొంటుందని గవర్నర్‌ తమిళసై సౌందర రాజన్‌ తెలిపారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *