రంగారెడ్డి జిల్లా : ఆధిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్ పల్లి గ్రామంలో చిరుత పులి దాడి చేసింది. మదం బాల్ రాజు అనే రైతుకు చెందిన ఆవుల మంద పై రాత్రి చిరుత దాడి చేసింది. లేగదూడను చిరుత చంపి తినేసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లేగదూడపై చిరుత దాడిని గమనించిన కాపరి విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. అయితే..10 రోజుల క్రితమే స్థానికంగా చిరుత ఆనవాళ్లు గమనించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.