మర్రిగూడ మండలంలో చిరుత కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు
Published on 14 Jan 2020 8:23 AM GMT
నల్గొండ : జిల్లాలోని మర్రిగూడ మండలం అజలాపురం గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిక్కుకుపోయింది. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. మత్తు మందు ప్రయోగించి చిరుతను బంధించారు. అనంతరం జూ కి తరలించారు. చిరుత ప్రత్యక్షంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో చిరుత కదలికలపై సమాచారమిచ్చినా అటవీ శాఖ అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు.
Next Story