సిద్దిపేట జిల్లాలో చిరుతపులి మృతి

By సుభాష్  Published on  17 April 2020 2:21 AM GMT
సిద్దిపేట జిల్లాలో చిరుతపులి మృతి

సిద్దిపేట జిల్లాలో చిరుతపులి మృతి తీవ్ర కలకలం రేపింది. మిరుదొడ్డి మండలం కాసులబాద్‌ గ్రామ అడవిలో ఈ చిరుత అనుమానస్పదంగా మృతి చెందింది. గ్రామ సర్పంచ్‌, ఫారెస్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ అటవీ ప్రాంతంలో చిరుత మృతి చెందినట్లు గ్రామస్థులు ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని ఫారెస్ట్‌ బీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు తెలిపారు. శుక్రవారం చిరుతకు పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలిపారు.

Next Story
Share it