2020: లీపు సంవత్సరం అంటే ఏమిటీ..?

2020 ఏడాది ‘లీపు సంవత్సరం’ సాధారణంగా ఫిబ్రవరి నెలలో 28రోజులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 29 రోజులు వస్తున్నాయి. మొత్తం సంవత్సరానికి 365 రోజులు. కానీ ఈ ఏడాది 366 రోజులు వచ్చాయి. అసలు ఫిబ్రవరి నెలలో 29వ రోజు ఎందుకు వస్తుంది..? ఈ అనుమానం చాలా మందికి వస్తుంది.

లీపు సంవత్సరం ఎలా వచ్చిందంటే..

భూమి సూర్యుడి చుట్టూ తిరగాడానికి పట్టే సమయం 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు. అంటే 365 రోజులతో పాటు పావు రోజు పడుతుందన్నట్లు. పావు రోజును ఒక రోజుగా తీసుకోలేము కాబట్టి ప్రతీ నాలుగు సంవత్సరాల్లో నాలుగు పావులు కలిపి ఒక రోజుగా పరిగణిస్తారు. అందుకే ఈ సంవత్సరం లీప్‌ సంవత్సరంగా భావించాల్సి ఉంటుంది. 2016లో వచ్చిన ఈ లీపు సంవత్సరం ఇప్పుడు 2020లో వచ్చింది. తిరిగి 2024లో రానుంది. ప్రతి నాలుగేళ్లకోసారి ఒక రోజు అదనంగా వస్తుంది. కాగా, ఈ సూర్యుని భ్రమణం ఫిబ్రవరి నెల 28కి ముగుస్తుంది. తర్వాత రోజును 29వ రోజుగా పెట్టారు శాస్త్రవేత్తలు. మళ్లీ మార్చి నుంచి సూర్యుడి భ్రమణం మొదటి నుంచి మొదలవుతుంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.