2020: లీపు సంవత్సరం అంటే ఏమిటీ..?
By సుభాష్ Published on 27 Feb 2020 3:06 PM IST2020 ఏడాది 'లీపు సంవత్సరం' సాధారణంగా ఫిబ్రవరి నెలలో 28రోజులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 29 రోజులు వస్తున్నాయి. మొత్తం సంవత్సరానికి 365 రోజులు. కానీ ఈ ఏడాది 366 రోజులు వచ్చాయి. అసలు ఫిబ్రవరి నెలలో 29వ రోజు ఎందుకు వస్తుంది..? ఈ అనుమానం చాలా మందికి వస్తుంది.
లీపు సంవత్సరం ఎలా వచ్చిందంటే..
భూమి సూర్యుడి చుట్టూ తిరగాడానికి పట్టే సమయం 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు. అంటే 365 రోజులతో పాటు పావు రోజు పడుతుందన్నట్లు. పావు రోజును ఒక రోజుగా తీసుకోలేము కాబట్టి ప్రతీ నాలుగు సంవత్సరాల్లో నాలుగు పావులు కలిపి ఒక రోజుగా పరిగణిస్తారు. అందుకే ఈ సంవత్సరం లీప్ సంవత్సరంగా భావించాల్సి ఉంటుంది. 2016లో వచ్చిన ఈ లీపు సంవత్సరం ఇప్పుడు 2020లో వచ్చింది. తిరిగి 2024లో రానుంది. ప్రతి నాలుగేళ్లకోసారి ఒక రోజు అదనంగా వస్తుంది. కాగా, ఈ సూర్యుని భ్రమణం ఫిబ్రవరి నెల 28కి ముగుస్తుంది. తర్వాత రోజును 29వ రోజుగా పెట్టారు శాస్త్రవేత్తలు. మళ్లీ మార్చి నుంచి సూర్యుడి భ్రమణం మొదటి నుంచి మొదలవుతుంది.