సాయంత్రం గవర్నర్‌ తమిళసైని కలవనున్న విపక్షాల నేతలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 2:04 PM IST
సాయంత్రం గవర్నర్‌ తమిళసైని కలవనున్న విపక్షాల నేతలు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నాలుగు వారాలకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ డిమాండ్లను సాధించుకునేంత వరకూ సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ కార్మిక సంఘాలు చెబుతున్నాయి. దీంతో ప్రయాణ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లాల్సిన విద్యార్థులు బస్సులు నడవకపోవడంతో సతమతమవుతున్నారు. దూరం ప్రయాణం చేసే వారికి ఇక్కట్లు తప్పడం లేదు. ప్రజా రవాణే మా ధ్యేయమని, అని వర్గాల ప్రజలకు సమానంగా రవాణా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇంత జరుగుతున్న స్పందించకపోవడంపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం విపక్ష నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెపై స్పందించాలని గవర్నర్‌ను విపక్ష నేతలు కోరనున్నారు. అన్ని పార్టీల నేతలకు సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ అపాయింట్‌ మెయింట్‌ లభించింది.

Next Story