చంద్రబాబును జైలుకు పంపిస్తానన్న తన ప్రతీకారం నెరవేరకుండానే ఆ గుండె ఆగిపోయింది

By సుభాష్  Published on  18 Jan 2020 7:12 AM GMT
చంద్రబాబును జైలుకు పంపిస్తానన్న తన ప్రతీకారం నెరవేరకుండానే ఆ గుండె ఆగిపోయింది

తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిన నందమూరి తారాకరామారావు 24వ వర్థంతి. 35 సంవత్సరాలుగా సినీ రంగాన్ని, అలాగే దేశ వ్యాప్తంగా రాజకీయాలలో చెరగని ముద్రవేశారు. ఇక ఎన్టీఆర్‌ మరణం మర్చిపోలేని విషాదమనే చెప్పాలి. రోమ్‌ చక్రవర్తి సీజర్‌కు జరిగినట్లే అల్లుడి రూపంలో ఎన్టీఆర్‌కు జరగడం అత్యంత విషాదమని ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. 'సాక్షి' దినపత్రికకు లక్ష్మీపార్వతి ఆవేదనతో రాసిన వ్యాసాన్ని పరిశీలిస్తే..

చరిత్రను ఎంత తొక్కేసినా సత్యాలు మాత్రం దాగవని, ఏదో ఒక రోజు బయటపడి వాళ్ల నిజ స్వరూపం బయటపెడతాయని, చంద్రబాబును ఘోరంగా ఓడించిన ఏపీ ప్రజలు రుజువు చేశారు. మొదటి నుంచి స్వార్థం, కుట్రలు, అడ్డదారి రాజకీయాలు తొక్కి చంద్రబాబు చేసిన నేరాలకు అంతేలేదు. ఎంతో మందిని అణగదొక్కి రాజకీయ నాయకుడిగా ఎదిగి ఎన్టీఆర్‌ అల్లుడిగా ఆ ఇంట్లో అడుగు పెట్టి చివరకు ఆ ఇంటి పెద్దనే కూల్చేశాడు. చంద్రబాబు చేసిన ఈ దారుణాన్ని తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోకూడదని మళ్లీ గుర్తు చేస్తున్నానని లక్ష్మీపార్వతి తన వ్యాసంలో పేర్కొన్నారు.

మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్‌ నాయకులు దగ్గుబాటు, నాదెండ్ల , నల్లపురెడ్డి శ్రీనివాసులు, ఉపేంద్ర లాంటి వారిని తెలివిగా పక్కన పెట్టించారు. ప్రధాన కార్యదర్శి పదవితో పాటు స్వరాధికారాలతో 1989లోకర్షక పరిషత్‌ తీసుకున్నాడు. ఈ చర్యలు న్యాయస్థానం, ప్రజలు హర్షించలేకపోయారు. ఇక 1989లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ప్రభుత్వం పతనం, రాజ్యాంగేతర శక్తిగా, అవినీతిపారుడిగా ఎన్టీఆర్‌ సర్కార్‌కు మచ్చతెచ్చాడు. 70 ఏళ్ల వయసులో చూసుకునేవారు లేక, అనారోగ్యంతో బాధపడుతూ 1993లో ఎన్టీఆర్‌ లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకుంటే నానా హంగామా సృష్టించి పెళ్లికి ముందూ, వెనుకా అతడు చేసిన కుట్రలు లేక్కుకు మించే ఉన్నాయి. పైగా వినయంగా నటించడంలో చంద్రబాబు తర్వాతే.

1994 ఎన్నికల్లో 60 మంది సభ్యులకు స్వయంగా డబ్బులు పంచి తనతో ఉండాలని హుకూం జారీ చేశాడు. అతని గురువైన రామోజీ లెక్కల ప్రకారం.. టీడీపీ పార్టీ గెలవదని, వచ్చిన సీట్లలో తన 60 మందిని వేరు చేసుకుని కాంగ్రెస్‌తో చేతులు కలపాలనే నిర్ణయంతో కుట్ర రాజకీయాలకు దిగాడు. ఈ రోజు సీఎం జగన్‌ మీద, ఆయన ప్రభుత్వం మీద ఎలాంటి నిందారోపణలు చేస్తున్నాడో ఆ రోజు కూడా అలానే జరిగిందన్నారు. ఈ కారణంగానే ఆరోజుల్లో ఓ పత్రికను ఎన్టీఆర్‌ చెత్తబుట్టగా వర్ణించాడు. 1994 ఎన్నికల్లో వాళ్ల అంచనాలకు మించి ఎన్టీఆర్‌కు 222 సీట్లు వచ్చాయి. మిత్ర పక్షాలకు 36 సీట్లు రావడంతో అయోమయానికి గురయ్యారు.

ఇక గురుశిష్యులు ఇద్దరూ చేసిన ప్లాన్‌ బెడిసి కొట్టడంతో, చేసేదేమి లేక ప్లాన్‌-2కు రెడ్డీ అయ్యారు. దీంతో ఎన్టీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరవేరుస్తున్నప్పటికీ ఆయనపై, ఆయన భార్య మీద విమర్శలదాడి మొదలైంది. ఈరోజు ఏపీ ప్రభుత్వం పేద ప్రజలకు నవరత్నాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే లేనిపోని ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. రాజధాని పేరుతో దుష్టపన్నాగం మొదలైంది. చంద్రబాబు వేసిన కుట్రలన్నింటిని ఈ సర్కార్‌కు ఆపాదిస్తూ ఈ విషపత్రికల కూటమి ఎలా దండయాత్ర చేస్తోందో చూస్తూనే ఉన్నాము. 1994 నాటి పరిస్థితి పునరావృతం అవుతున్నది. అదే పెత్తందారి వ్యవస్థ. అదే సామాజిక వర్గం. అదే గురుశిష్యులు. సామాజిక అభివృద్ధితో వీళ్లకు పనిపాట లేదు. పేద వర్గాలంటే జాలి అస్సలు ఉండదు. మంచి పనులు చేసే నాయకుడంటే అస్సలు మింగుడు పడదు.

అవినీతి రాజ్యాన్ని దక్కించుకునేందుకు ఎన్నో కుట్రలకు పాల్పడతారు. ఎన్ని హత్యలైనా చేస్తారు. వీళ్లను మీడియానే కాపాడుతూ వస్తోంది. అందుకే ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎన్నో కుట్ర రాజకీయాలు చేశారు. వీరి కుట్రలను ఎన్టీఆర్‌ గుర్తించలేక అమాయకంగా మోసపోయారు. ప్రజాస్వామ్య బద్దంగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన ముఖ్యమంత్రిని ఎనిమిది నెలలు తిరగకుండానే ఆయన భార్యను సాకుగా చూపించి 1995 ఆగస్టు 20వ తేదీన బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు. ఆ సమయంలో ఈటీవీని ప్రారంభించారు. కుటుంబ సభ్యులకు విషం నూరిపోసి పార్టీ పగ్గాలు వారికే ఇస్తామని నమ్మబలికి చివరకు అధ్యక్ష పదవితో పాటు సీఎం పదవి కూడా కొట్టేశాడు. ఇక డిప్యూటీ సీఎం పదవి మీద ఆశతో 40 మంది ఎమ్మెల్యేలతో వెళ్లిన దగ్గుబాటి చంద్రబాబు మోసానికి బలై వారం తిరగుకండానే 14 మంది తిరిగొచ్చి ఎన్టీఆర్‌ గూటికి చేరారు.

ఆగస్టు 25వ తేదీన చంద్రబాబు హరికృష్ణను వెంట పెట్టుకుని ఎన్టీఆర్‌ను కలిసి కొన్ని షరతులు విధించాడు పార్వతిని వంటింట్లో ఉంచడం, ముద్దు కృష్ణను, బుచ్చయ్యచౌదరిని, నర్సింహుల మంత్రి పదవులు తొలగించడం లాంటి షరతులను ఆయన తీవ్రంగా వ్యతిరేకించడంతో అనేక కుట్రలు పన్నారు. ఆగస్టు 25న ఎన్టీఆర్‌ చంద్రబాబుతో సహా ఐదుగురు మంత్రులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి లేటర్‌ గవర్నర్‌కు పంపినా.. అందుకు వ్యతిరేకించి చంద్రబాబుకు ప్రాధాన్యత ఇచ్చారు. అవమానంతో కుంగిపోయి ఎన్టీఆర్‌ కన్నీళ్లు పెట్టుకుంటే అల్లుడని గౌరవించినందుకు నాకింత ద్రోహం చేశాడు. దేశ ప్రజలు గౌరవించిన వ్యక్తిని చెప్పులతో అవమానించాడు. ఇదంతా వాడికి పట్టిన అధికార దాహం. ఎన్టీఆర్‌ ఎప్పుడో చావడం కాదు.. చంద్రబాబు చేసిన కుట్రలు, కుతంత్రాలు, దుర్మార్గానికి ఇప్పుడే చనిపోయాడు.. అని విలపించడంతో అక్కడికి వచ్చిన వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. దానికి కూడా సానుభూతి రానివ్వకుండా లక్ష్మీపార్వతి మీద నెట్టేశారు.

ఆగస్టు 31న ఎన్టీఆర్‌ తీవ్ర అనారోగ్యంతో మెడిసిటీ ఆస్పత్రిలో చేరారు. గవర్నర్‌ను పంపి బలవంతపు రాజీనామా తెప్పించుకున్నారు. ఇక్కడ ఎన్టీఆర్‌ తీవ్ర మనోవేదనతో ఉంటే కుటుంబ సభ్యులందరూ కలిసి విందులు, వినోదాలు, భోగిమంటల్లో, ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. నమ్మిన విశ్వాసమే నట్టేట ముంచింది. కడుపుకు అన్నం పెట్టిన చెయ్యినే నరికింది. అయినవారే పగవాడిగా మారి గుండెల్లో గునపాలు గుచ్చుతుంటే తట్టుకోలేని రోషం, అభిమానం మంటల్లో బుగ్గుపాలైంది. మళ్లీ గెలిచి చంద్రబాబును అండమాన్‌ జైలుకు పంపిస్తానన్న తన ప్రతీకారం నెరవేరకుండానే ఆ గుండె ఆగిపోయింది.

'' ఇదిగో వీడే హంతకుడు. ప్రజలారా మీ అన్నను చెబుతున్నాను వినండి'' అంటూ ''జామతా దశమగ్రహం'' అనే ఆడియో రూపంలో, ''ధర్మపీఠం''లో వీడియో రూపంలో తనను ఎంతో అభిమానంతో ఎన్నుకున్న తన తెలుగు ప్రజలకు 1996, జనవరి 18వ తేదీన తెల్లవారుజామున మూడు గంటలకు ఆ మహానాయకుడు అందరిని దుఃఖంలో ముంచివెళ్లిపోయాడు. మద్యపాన నిషేధం ద్వారా మహిళల కళ్లలో ఆనందం నింపిన ఆయన కళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. దీనికి ఎవరు కారకులు..? తన అధికారం కోసం మామ చావుకు కారకుడైన వ్యక్తిపై ఆత్మ ప్రతీకారంతో రగులుతూనే ఉంది. ఇక సీఎం జగన్‌ను చావుదెబ్బ కొట్టి 23 సీట్లకే పరిమితం చేయకుండా స్వర్గంలోని ఆయన ఆత్మ సంతోషిస్తూ ఉంటుంది. చంద్రబాబు వంటి వ్యక్తులను రాజకీయ రంగం నుంచి పూర్తిగా తొలగిస్తే సమాజంలో ప్రశాంత వాతావరణం ఉంటుందని నమ్ముతూ..

Laxmiparvati

- ఆవేదనతో.. నందమూరి లక్ష్మీపార్వతి

Next Story