హైదరాబాద్ : డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ ని నిన్న ఏసీబీ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. లంచం కోసం లక్షల విలువ చేసే డైమండ్ నక్లెస్‌ను లక్ష్మీ డిమాండ్ చేసింది. ఈ దృశ్యాలు ఎక్స్‌ క్లూజివ్‌గా న్యూస్ మీటర్ కు దొరికాయి.
లక్ష్మీ పై స్పై ఆపరేషన్ చేసి విజువల్స్ ఏసీబీకి అందజేశాడు బ్లడ్ బ్యాంక్ యజమాని. కెమెరా విజువల్స్ తో లక్ష్మి ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు ఏసీబీ అధికారులు. బ్లడ్ బ్యాంక్‌కు అనుకూలంగా నివేదిక ఇచ్చినందుకు లక్ష్మీ లక్ష రూపాయలు విలువచేసే జ్యుయలరీ తీసుకున్నారు. అంతకముందు కూడా రూ.50వేలు లంచంగా తీసుకున్నారు. ఇప్పుడు కూడా డైమండ్ నెక్లస్ కావాలని లక్ష్మీ డిమాండ్ చేసిందని బ్లడ్ బ్యాంక్‌వారు చెప్పారు. ఒక ప్లాన్ ప్రకారం లక్ష్మీకి జ్యుయలరీ ఇవ్వడానికి బ్లడ్ బ్యాంక్‌ వారు కొందరిని పంపారు. లక్ష్మీ నగలు తీసుకుంటుండగా అధికారులు ఎంటరై అమెను పట్టుకున్నారు. స్పాట్‌లోనే లక్ష్మీని అరెస్ట్ చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.