ప్చ్ లావణ్య.. బికినీ కోసం 'నభా'కి అన్యాయం చేస్తావా ?  

By Newsmeter.Network  Published on  30 Jan 2020 2:30 PM GMT
ప్చ్ లావణ్య.. బికినీ కోసం నభాకి అన్యాయం చేస్తావా ?  

అర్జున్ సురవరం సినిమా రూపంలో టాలెంటెడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి రీసెంట్ గా మంచి హిటే వచ్చింది. అయితే ఎంత టాలెంట్ అండ్ ఎంత గ్లామర్ ఉన్నా లావణ్య కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో కొనసాలేదు. కనీసం 'అర్జున్ సురవరం' సక్సెస్ తోనైనా కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లదామని అమ్మడు ఫుల్ గా ప్రయత్నాలు మొదలుపెట్టినా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు మాత్రం రావట్లేదు. మొదట్లో ఎక్స్ పోజింగ్ చెయ్యను అని ఓవర్ గా స్టేట్ మెంట్స్ ఇచ్చిన లావణ్య.. చివరికీ లిప్ టు లిప్ కిస్ కి కూడా సై అంటున్నా స్టార్ హీరోలు మాత్రం అమ్మడును అసలు పట్టించుకోవట్లేదు.

అయితే హీరో 'రెడ్' సినిమాలో ఓ బోల్డ్ క్యారెక్టర్ ఉంది. బికినీ సూట్ లతో పాటు కాస్త ఘాటు సీన్స్ లో కూడా నటించాల్సి ఉంటుంది. ఈ రోల్ కోసం 'నిధి అగర్వాల్' పోటీ పడుతుంది. రామ్ కూడా నిధి వైపే మొగ్గు చూపాడు. అయితే ఆ రోల్ నేను చేస్తానని అప్రోచ్ అయిందట లావణ్య త్రిపాఠి. ఇంతకు ముందెప్పుడూ లావణ్య త్రిపాఠి ఈ రేంజ్ లో బోల్డ్ క్యారెక్టర్ లో నటించట్లేదు. సో.. సినిమా హైప్ పరంగా చూసుకుంటే నభా కంటే కూడా లావణ్యనే బెటర్ అని ఫీల్ అవుతుంది చిత్రబృందం. ఆ రకంగా నభా నటేష్ కి అన్యాయం చేసి.. బికినీ రోల్ ను లావణ్య పట్టేసింది.

ఇక యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న "చావు కబురు చల్లగా" చిత్రంలో కూడా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించబోతుంది. ఈ సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా రానుంది. కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠిది కీలక పాత్ర అట. సినిమా కథ లావణ్య చుట్టూనే తిరుగుతుందట. మొత్తానికి కెరీర్ ను లేట్ గా అయినా బాగానే ప్లాన్ చేసుకుంటుంది అమ్మడు.

Next Story