'రాముల‌మ్మ' సినిమాల్లో న‌టించాలంటే రెండు కండీష‌న్లు.!

By సుభాష్  Published on  4 Jan 2020 8:49 PM IST
రాముల‌మ్మ సినిమాల్లో న‌టించాలంటే రెండు కండీష‌న్లు.!

నేటి భారతం', 'ప్రతిఘటన', 'కర్తవ్యం', 'ఒసేయ్‌ రాములమ్మ' వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన జాతీయ ఉత్తమ నటి, లేడీ అమితాబ్‌ విజయశాంతి. సూపర్‌స్టార్‌ మహేశ్‌ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో భారతి పాత్రతో అద్భుతమైన రీఎంట్రీ ఇస్తున్నారు. లేడి సూప‌ర్‌స్టార్‌గా పేరున్న విజ‌య‌శాంతి దాదాపు 13 ఏళ్ల త‌ర్వాత సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. సూప‌ర్‌స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా విజయశాంతి తెర‌పై క‌నిపించ‌నున్నారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'సరిలేరు నీకెవ్వరు'. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 11న‌ ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ మూవీలో భారతి అనే ప్రొఫెస‌ర్ పాత్ర‌లో రాముల‌మ్మ న‌టించింది. విజ‌య‌శాంతి ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. గ‌తంలోనూ ఓ సినిమా కోసం ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి త‌న‌ను సంప్ర‌దించార‌ని, కాని స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో పాత్ర త‌న‌కు బాగా న‌చ్చింద‌ని, అందుకే ఒకే చెప్పాన‌ని అన్నారు. ఈ పాత్ర‌లో విజ‌య‌శాంతిని త‌ప్ప మ‌రెవ‌రిని ఊహించుకోలేన‌ని అనిల్ రావిపూడి సైతం గ‌తంలో చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఖ‌చ్చితంగా హిట్ కొడుతుంద‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు.

కానీ, ఏదైన సినిమాను ఒప్పుకునేందుకు మాత్రం రెండు కండిష‌న్లు పెడుతున్నార‌ట‌ విజ‌య‌శాంతి. ఒక‌టి రెమ్యూన‌రేష‌న్‌, రెండోది త‌న‌కు న‌చ్చిన పాత్ర గురించి. రెమ్యూన‌రేష‌న్‌లో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గేది లేద‌ని చెబుతార‌ని, అలాగే ఒక వేళ తాను అనుకున్న రెమ్యూరేష‌న్ ఇచ్చినా.. త‌న‌కు న‌చ్చిన పాత్ర కూడా ఉండాల‌ని కండిష‌న్లు పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏదో ఒక చిన్న పాత్ర ఇస్తే మాత్రం మోహ‌మాటం లేకుండా నో చెప్పేస్తుంద‌ట‌. అలాగే త‌ల్లి పాత్ర‌లు కూడా అన్నిచేయ‌లేన‌ని, సినిమాలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న పాత్ర‌లుంటేనే న‌టిస్తాన‌ని ముక్కుసూటిగా చెప్పేస్తార‌ని టాక్‌.

కాగా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి త‌న త‌దుప‌రి చిత్రానికి కూడా విజ‌య‌శాంతిని ఓకే చెప్పించుకున్న‌ట్లు తెలుస్తోంది. త‌న మ‌రో సినిమా ఎఫ్ 2 సీక్వెల్‌ను అనిల్ రావిపూడి తెరకెక్కించ‌నున్న‌ట్లు సినీ ఇండ‌స్ట్రీలో వార్త‌లు వినిపిస్తున్నాయి

సూపర్‌స్టార్‌ మహేశ్‌ ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడే 'కొడుకు దిద్దిన కాపురం' చిత్రంలో నటించారు. మళ్ళీ ఇన్నేళ్లకు సూపర్‌స్టార్‌ మహేశ్‌ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో లేడీ అమితాబ్‌ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే కొన్ని భారీ నిర్మాణ సంస్థలు లేడీ అమితాబ్‌ విజయశాంతితో నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

Next Story