టైలర్ గా లేడీ కానిస్టేబుల్..5000 మాస్కులే లక్ష్యం
By రాణి Published on 16 April 2020 7:55 AM GMTలేడీ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూనే..ఉన్న కాస్తంత ఖాళీ సమయాన్ని కూడా ప్రజలు ఉపయోగపడేలా పనిచేస్తోంది అమరేశ్వరి. ప్రస్తుతం నెలకొన్నపరిస్థితుల నేపథ్యంలో పోలీస్ వృత్తిలో ఉన్నవారెవ్వరికీ క్షణం తీరిక ఉండట్లేదు. విధి నిర్వహణలో అలసిపోయినా..ప్రజలను కాపాడాలన్న సంకల్పంతో ఈ మహిళా కానిస్టేబుల్ విధులు ముగిశాక దొరికే కొద్ది సమయంలోనే కుట్టు మిషన్ కు పని చెప్తున్నారు. మాస్కులను కుట్టి చుట్టుపక్కల ఇళ్లలో ఉచితంగా పంచిపెడుతున్నారు. ఇప్పటి వరకూ 500 మాస్కులు తయారు చేసి పంపిణీ చేసిన అమరేశ్వరి 5000 మాస్కులను తయారు చేయడమే తన లక్ష్యమని తెలిపారు. అమరేశ్వరి గవర్నర్ భద్రతా సిబ్బంది లో లేడీ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.
మహిళల వన్డే ప్రపంచకప్‌కు మిథాలీ సేన అర్హత
లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రజలను కాపాడేందుకు డాక్టర్లెంత కృషి చేస్తున్నారో..పోలీసులు కూడా అంతే కష్టపడుతున్నారు. పారిశుధ్య సిబ్బంది సైతం తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వైద్యులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బందిని చూస్తే చాలు ప్రజలు ఆమడదూరంలోకి వెళ్తున్నారు. నిజానికి వారు మనలాంటి వారే. మన ప్రాణాలను కాపాడేందుకే వారి కుటుంబాలను కూడా పట్టించుకోకుండా విధులు నిర్వహిస్తున్నారు.
అప్పుతీర్చలేదని బాధితుడి భార్యను బంధించిన వడ్డీ వ్యాపారి