బస్సు డ్రైవర్ కాళ్లు మొక్కిన మహిళా కండక్టర్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 10:46 AM GMT
బస్సు డ్రైవర్ కాళ్లు మొక్కిన మహిళా కండక్టర్..!

హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉధృతమవుతుంది. సికింద్రాబాద్ రాణిగంజ్ డిపో దగ్గర ప్రైవేట్ డ్రైవర్ నడుపుతున్న బస్సును ఆర్టీసీ కార్మికులు అడ్డగించారు. డ్రైవర్‌కు పువ్వు ఇచ్చి నిరసన తెలిపారు. ప్రయాణికులను జాగ్రత్తగా చూసుకోమని కాళ్లు మొక్కారు ఓ మహిళా కండక్టర్.

మరోవైపు..ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వం మధ్య చర్చలు ఇంకా ప్రారంభంకాలేదు. మరో పక్క..స్కూళ్లు, కాలేజీలు తెరవడంతో బస్సులు సరిగా లేక విద్యార్దులు నానాఇబ్బందులు పడ్డారు. మరోవైపు.. ఆర్టీసీ సమ్మెపై కోర్టులో ఇరుగ్రూప్ ల వాదనలు జరుగుతున్నాయి.

Next Story