రెండేళ్ల లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్క, హ్యాటి, చికాగో రాష్ట్ర న్యాయవాది అఫీస్ లో ఉద్యోగంలో చేరింది. 9 - 5 పని వేళల్లో హ్యాటి పని చేస్తుంది. అయితే, ఒక కుక్క ఆఫీసులో ఏమి పని చేస్తుంది అని మీరు అడగవచ్చు... అందరికీ ప్రేమ చూపించడమే దాని పని.

నేర విచారణలలో పాల్గొంటున్నప్పుడు, అత్యాచారం జరిగిన చిన్నారులను పరిరక్షిస్తూ, వారికి స్వాంతన కలిగిస్తూ, ప్రేమగా చుసుకోవడమే హ్యాటీ పని.

అమెరికా కాలమానం ప్రకారం, అక్టోబర్ 30, మంగళవారం రోజున తన ముందరి కాళ్లతో న్యాయ పుస్తకం పైన ప్రమాణ స్వీకారం చేసి ఉద్యోగంలో చేరింది హ్యాటి.

సత్య ప్రియ బి.ఎన్

Next Story