తూర్పు గోదావరి జిల్లా: కచ్చులూరు వద్ద రాయల్‌ వశిష్ట బోటు వెలికితీత ఆపరేషన్‌ పనులు ఆరో రోజు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి 10 మంది డీప్ వాటర్ డ్రైవర్స్ ఘటన స్థలాన్ని చేరుకున్నారు. నీటిలోపలకి వెళ్లి బోటుకు లంగర్లు వేసి దుబాసీలు బయటకుతీసే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి ఒడ్డుకు 190 అడుగుల దూరంలో బోటు ఉన్నట్లుగా గుర్తించారు. అనంతరం ఇద్దరు డ్రైవర్స్‌ నది అడుగు భాగంలోకి వెళ్లి పరిస్థితి గమనించారు. బోటు మునిగిన ప్రాంతంలో నదీ గర్భం “V” ఆకారం లో ఉందని తెలిపారు. మరలా ఐరన్ రోపు తీసుకుని బోటు ని బంధించేందుకు నీటిలోకి వెళ్లారు. ప్రస్తుతం బోటు కేవలం 38 అడుగులు లోతులో ఉన్నట్లు తెలుస్తోంది.బోటును మరో ఇరవై మీటర్లు మేర ఒడ్డు వైపునకు తీసుకొస్తే బోటును సునాయాసంగా ఒడ్డుకు చేర్చవచ్చు..అన్నీ అనుకూలిస్తే ఈ రోజు సాయంత్రమే బోటు బయటకు వచ్చే అవకాశం ఉంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.