ఈ ఆస్పత్రిలో 77 మంది శిశువులు మృతి

By సుభాష్  Published on  28 Dec 2019 5:34 PM IST
ఈ ఆస్పత్రిలో 77 మంది శిశువులు మృతి

రాజస్ధాన్‌ సర్కార్‌ ఆస్పత్రిలో శిశువుల మృతి రోజురోజుకు పెరిగిపోతోంది. అప్పుడు అమ్మ కడుపులోంచి బయటకు వచ్చిన చిన్నారులను మృత్యువు వెంటాడుతోంది. కడుపులోంచి బయటకు రాగానే పూర్తిగా కళ్లు తెరవకముందే శాశ్వతంగా కళ్లు మూసేస్తున్నారు. 48 గంటల వ్యవధిలోనే 10 మంది శిశువులు మరణించారు. శిశువుల మరణంతో కన్నతల్లులకు తీరని విషాదంగా మిగిలిపోతోంది. కోటలోని జేకేలాన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో డిసెంబర్‌ 23న ఆరుగురు, డిసెంబర్‌ 24న నలుగురు చిన్నారులు మృత్యు ఒడిలోకి వెళ్లిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువులు మృత్యువాత పడుతున్నారని బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులపై తీవ్ర స్థాయిలో పండిపడిపోతున్నారు. ఈ ఘటనపౌ ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. ముగ్గురు నిపుణులతో ఓ కమిటీ వేసింది. విచారణ అనంతరం చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు.

కాగా, ఆక్సిజన్‌ సరైన సమయంలో అందకపోవడంతో ఇన్‌ఫెక్షన్‌ సోకి శిశువు జన్మించిన 48 గంటల్లోనే మృతి చెందినట్లు ఓ వైద్యుడు ద్వారా తెలుస్తోంది. కాగా, జేకేలాన్‌ ఆస్పత్రికిలో డిసెంబర్‌ నెలలోనే 77 మంది శిశువులు మృతి చెందడంపై తీవ్ర కలకలం రేపుతోంది. 2019 ఏడాదిలో మొత్తం 940 మంది శిశువులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

Next Story