పోలీస్ స్టేషన్ నే కొల్లగొట్టారు..
By Newsmeter.Network Published on 14 Jan 2020 1:31 PM IST
సాధారణంగా మన ఇంట్లో ఏవైనా వస్తువులు చోరీకి గురైతే మనం ఏంచేస్తాం..? పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేస్తాం..? మరీ పోలీస్ స్టేషన్ లోనే చోరీ జరిగితే..? అవునండి మీరు విన్నది నిజమే. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది. కొల్హాపూర్ దగ్గర్లోని జైసింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ లో ఉంచిన దాదాపు రెండువందల ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు.
చోరీలు, బెదిరింపులు వంటి కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఫోన్లను స్టోర్ రూంలో పెట్టారు. అయితే గురువారం నుంచి ఈ ఫోన్లు కనిపించడం లేదని తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 185 ఫోన్లు చోరికి గురైనట్లు గుర్తించారు. అయితే ఇదంతా ఇంటి దొంగల పనే కావచ్చుననే అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story