పీటర్సన్‌కు అదిరే పంచ్‌ ఇచ్చిన కోహ్లీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2020 10:58 AM GMT
పీటర్సన్‌కు అదిరే పంచ్‌ ఇచ్చిన కోహ్లీ

ప్రస్తుతం క్రికెట్‌ ఆడే వారిలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరు అంటే.. ఎక్కువ మంది చెప్పే సమాధానం భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. గత కొన్నేళ్లుగా కోహ్లీ అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో అందరికి తెలిసిందే. దీనిపై ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తాను ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన తరువాతనే అత్యంత నిలకడగా రాణిస్తున్నానని చెప్పాడు. మ్యాచులు ఉన్నా లేకున్నా.. ప్రతి రోజు జిమ్‌కి వెలుతాడు కోహ్లీ. అయితే.. ప్రస్తుతం కరోనా కారణంగా జిమ్‌లు మూతపడడంతో ఇంట్లోనే వర్కౌట్లు చేస్తున్నాడు ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌.

తాను చేసే వర్కౌట్లకు సంబందించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటాడు కోహ్లీ. తాజాగా వెయిట్‌ లిప్టింగ్‌ చేస్తున్న ఓ వీడియోను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 'నేను రోజూ ఏదైనా ఎక్సర్‌ సైజ్ లు చేయాలని అనుకుంటే వెయిట్‌లిప్టింగ్‌ పుషప్‌ను తప్పకుండా ఉంచుకుంటా. ఎందుకంటే అది నా ఫేవరేట్‌. నాలో ఎంత పవర్‌ ఉందనేది బయటపెడుతుంది. అందుకే ఈ వర్కవుట్‌ను బాగా ఇష్టపడుతుంటా అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Untitled 3 Copy

ఈ వీడియో చేసిన ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ సరదాగా కామెంట్‌ చేశాడు. ఏయ్‌ కోహ్లీ.. బైక్‌ పై ఈ వర్కౌట్స్‌ చేయ్‌ అంటూ కామెంట్‌ చేశాడు. దీనికి విరాట్‌ సూపర్‌ పంచ్‌ ఇచ్చాడు. రిటైర్‌మెంట్ తరువాత తప్పకుండా చేస్తా అంటూ బదులు ఇచ్చాడు కోహ్లీ. వీరిద్దరు మంచి మిత్రులు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరు కలిసి పలు లైవ్‌ చాట్‌లో పాల్గొని అనేక విషయాలు పంచుకున్న సంగతి తెలిసిందే.Next Story