అత‌న్ని టెస్టుల్లో పించ్‌హిట్ట‌ర్‌గా 3వ స్థానంలో పంపుతాం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Dec 2019 2:03 PM GMT
అత‌న్ని టెస్టుల్లో పించ్‌హిట్ట‌ర్‌గా 3వ స్థానంలో పంపుతాం..!

టీమిండియా పేస్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పొగడ్తలతో ముంచెత్తాడు. ఉమేశ్ యాద‌వ్ బ్యాటింగ్ తీరు చూస్తుంటే టెస్టుల్లో పించ్‌ హిట్టర్‌గా 3వ స్థానంలో పంపాల‌ని ఉంద‌ని కోహ్లి అన్నాడు. ఈ ఏడాది టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన‌ ఉమేశ్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు.

ఉమేష్ యాద‌వ్ బ్యాటింగ్‌పై కోహ్లీ స్పందిస్తూ.. విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌లో ఆల్‌రౌండ‌ర్ హార్థిక్‌ పాండ్యా విఫలమైనా మేం ఐదుగురు బౌలర్లతో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఏడో స్థానం వరకు కీపర్‌తో పాటు అశ్విన్‌, జడేజాలు బ్యాటింగ్‌ చేయగల సమర్థులు. తాజాగా వీరికి ఉమేశ్‌ కూడా జతయ్యాడు. అతని ఆటతీరు చూస్తుంటే టెస్టుల్లో పించ్‌ హిట్టర్‌గా 3వ స్థానంలో పంపించాలని ఉందని నవ్వుతూ అన్నాడు.

ఇదిలావుంటే.. ఇటీవ‌ల జ‌రిగిన‌ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు గాయంతో జ‌ట్టు నుండి వైదొలిగిన‌ జస్‌ప్రీత్‌ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్‌.. బ్యాటింగ్‌లో 10 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. ఉమేశ్‌ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు ఉండగా, టెస్టు చరిత్రలో 30 పరుగులకు పైగా చేసిన ఆటగాళ్లలో 310 స్టైక్‌రేట్‌ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు న్యూజీలాండ్‌ మాజీ కెప్టెన్‌ స్టీఫెన్‌ ప్లెమింగ్‌ పేరిట ఉంది. అతను 11 బంతుల్లో 31 పరుగులు చేశాడు.

Next Story