టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి విరామం దొరకడం చాలా అరుదు. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్‌ నుంచి రన్‌మెషీన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి లభించింది. దీంతో దొరికిందే ఛాన్స్ అనుకున్న కోహ్లీ భార్య‌ అనుష్కతో కలిసి విహార యాత్రకు వెళ్ళాడు. ఓ అందమైన ప్రదేశంలోని కొండ కోనల్లో, వాగు వంకల్లో అనుష్కతో కలిసి చక్కర్లు కొట్టాడు. అనుష్కపై తనకెంత ప్రేమ వుందో చూపించాడు. ఈ విహార యాత్రకు సంబందించిన పోటోలను కోహ్లీ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.

ఇదిలావుంటే.. బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌ నవంబర్ 10న ముగియనుండగా.. టెస్ట్ సిరీస్ 14నుండి ప్రారంభం కానుంది. అప్పటివరకు కోహ్లీకి సెలవులే. మరీ కోహ్లీ, అనుష్క జంట‌ ఇంకా ఎన్ని ప్రదేశాలు చుట్టొస్తారో చూడాలి.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.