ఎట్టకేలకు లొంగిపోయిన కోడెల శివరాం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Oct 2019 8:01 AM GMT
నరసరావుపేట : ఎట్టకేలకు కోడెల శివప్రసాదరావు తనయుడు.. కోడెల శివరాం నేడు నరసరావుపేట కోర్టులో లొంగిపోయాడు. ఇప్పటికే కోడెల శివరాం పైన 16 కేసులు నమోదయ్యాయి. ఈ నేఫథ్యంలో శివరాం హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై హైకోర్టు.. ఆ కేసుల్లో కోర్టుకు హాజరై మెయిల్ చేసుకోవచ్చని శివరాంకు సూచించింది. ఈ నేపథ్యంలోనే ఆయన నేడు నరసరావుపేట కోర్టుకు హాజరయ్యారు.
కాగా.. 'కే టాక్స్' పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని, అనేకమైన కేసులు ఎదుర్కొంటున్న కోడెల శివరాం ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్నారు. తండ్రి మరణం తర్వాత అజ్ఞాతం వీడిన కోడెల శివరాం.. కేసుల నుండి బయటపడే యోచనలో ఉన్నారు.
Next Story