హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఆయన ఉరేసుకుని ఈ అఘాయిత్యానికి యత్నించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని బసవతారకం ఆస్పత్రికి తరలించారు. కోడెల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పైన ఉన్నట్టు సమాచారం.

అసలేం జరిగింది..? కోడెల ఎందుకిలా చేశారు..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే, కొంత కాలంగా కోడెలను కేసులు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కోడెల అనుచరులు, ఆప్తులు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.