సత్తెనపల్లి : మాజీ స్పీకర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు తనయుడు కోడెల‌ శివరాం నేడు పార్టీ నాయకులతో రహస్య భేటీ అయ్యారు. సుమారు 50 మందికి పైగా పట్టణ, మండల ముఖ్య నాయకులతో మంతనాలు జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా రేపటి నుండి సత్తెనపల్లిలో అందరికీ అందుబాటులో ఉంటానని శివరాం వెల్లడించారు.

తండ్రి మరణం తర్వాత తొలిసారిగా సత్తెనపల్లికి వ‌చ్చిన‌ శివరాం.. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీసారు. నాయకులు, కార్యకర్తలు మనోధైర్యం తెచ్చుకోవాలని సూచించారు. ఇదిలావుంటే.. శివ‌రాం నేడు చంద్రబాబును కలవనున్నార‌ని స‌మాచారం. అలాగే.. రేపు నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నాడు. ఇప్పటికే రాయపాటి తనయుడు రంగారావు సత్తెనపల్లిలో ఉన్న నేపథ్యంలో ఇక్క‌డి రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.