కోడెల పర్సనల్‌ ఫోన్‌ మిస్ ఎలా..!?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Sep 2019 10:15 AM GMT
కోడెల పర్సనల్‌ ఫోన్‌ మిస్ ఎలా..!?

హైదరాబాద్: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు మృతి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. కోడెల పర్సనల్‌ ఫోన్‌ మిస్సైనట్టు పోలీసులు గుర్తించారు. కోడెల చివరిగా 24 నిమిషాల పాటు ఫోన్‌ కాల్‌ మాట్లాడినట్టు దర్యాప్తులో తేలింది. సోమవారం సాయంత్రం 5గంటల తర్వాత ఫోన్‌ స్విచాఫ్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. కోడెల కాల్‌ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

సోమవారం ఉదయం ఎప్పటిలాగే దినచర్య ప్రారంభించిన కోడెల.. ఉదయం 8.30 గంటల సమయంలో ఒకరితో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 20 నిమిషాలకు పైగా ఫోన్‌లో మాట్లాడినట్లు కాల్‌ రికార్డులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆ వ్యక్తి ఎవరు? ఆయనతో ఏం మాట్లాడారనేది తదుపరి దర్యాప్తులో తేలుతుందన్నారు. కోడెల ఫోన్‌ ఇన్‌కమింగ్‌, ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌ వివరాలు సేకరిస్తున్నామని, ఎస్‌ఎంఎస్‌ల్నీ కూడా పరిశీలిస్తున్నట్లు పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు.

Next Story
Share it