మాజీ స్పీకర్‌ కోడెల పార్దివదేహాన్ని గుంటూరు టీడీపీ  కార్యాలయంలో   ఉంచారు. అంతకు  ముందు   నందిగామ చేరుకున్న  కోడెల  పార్ధివదేహానికి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య  నివాళులు అర్పించారు. పలువురు టీడీపీ నేతలు కూడా కోడెల మృతదేహానికి నివాళులు అర్పించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా టీడీపీ నేతలు, కోడెల అభిమానులు డాక్టర్ మృతదేహం వెంట నడిచారు. బుధవారం  మాజీ స్పీకర్‌ కోడెల అంత్యక్రియలు జరగనున్నాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.