ఖమ్మం: ఇద్దరు ఘరానా దొంగలను లక్ష్మీదేవి పల్లి పీఎస్‌ పరిధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీస్ స్పెషల్ టీమ్‌ ఘరానా దొంగలను అదుపులోకి తీసుకుంది. ఎస్‌ కె నగర్‌ దగ్గర బస్సులో ఓ ప్రయాణికుడి దగ్గరు నంచి రూ.54, 300 కొట్టేశారు. ఈ ఘటన ఈ నెల 5న చుంచుపల్లి పీఎస్‌ పరిధిలో జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసు దర్యాప్తులో భాగంగా..సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి నలుగురు వ్యక్తులను అనుమానించారు. వారిలో ఇద్దరిని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన MD.అఫ్తాబ్, ఇర్కార్ అహ్మద్ లుగా గుర్తించినట్లు ..కొత్తగూడెం డిఎస్పీ ఎస్ ఎం అలీ తెలిపారు. దొంగిలించిన నగదును నలుగురూ తమ పర్సనల్ బ్యాంకు అకౌంట్లలోకి డిపాజిట్ చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఆ నలుగురి బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసినట్లు తెలిపారు.  కోర్టు ద్వారా బాధితులకు నగదును అందజేస్తామని చెప్పారు. వీరితో పాటు పలు నేరాల్లో పాల్గొన్న ఇమ్రాన్, వసీంలను త్వరలోనే పట్టుకుంటామన్నారు డీఎస్పీ.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.