నెం.12లో వచ్చినా.. సెంచరీ సాధిస్తావు బ్రో..
By Newsmeter.Network Published on 13 Feb 2020 2:23 PM ISTభారత క్రికెట్‌లో ప్రస్తుతం కేఎల్ రాహుల్ పేరు మార్మోగిపోతోంది. ఏ స్థానంలో వచ్చిన పరుగుల వరద పారిస్తున్నాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్. బ్యాటింగ్‌లో కాక వికెట్ కీపంగ్‌లో సైతం అదరగొడుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రాహుల్ శతకంతో రాణించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఆదుకున్నాడు. కాగా ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినా.. రాహుల్ పై మాత్రం ప్రశంసల జల్లు కురిస్తోంది.
తాజాగా ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పై టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు. 'కివీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించావ్ బ్రో.. ఇలానే నీ విధ్వంసాన్ని కొనసాగిస్తే.. 12వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా సెంచరీ సాధిస్తావ్' అని రాసుకొచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్.. రాహుల్ సెంచరీ చేసిన ఫోటోను షేర్ చేశాడు.
మూడు వన్డేల సిరీస్‌లో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఐదో స్థానంలో బరిలోకి దిగిన రాహుల్.. తొలి వన్డేలో 88 పరుగులు, మూడో వన్డేలో సెంచరీతో చెలరేగాడు. ఇకపోతే.. శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ధావన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో కివీస్ పర్యటనకు దూరం అయ్యాడు. కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది.