•  రూ 300 కోట్లకు కింగ్ కోటి ప్యాలెస్‌ను అమ్మేశారు
  •  కోర్టుకెక్కిన నిహారిక నిర్మాణ సంస్థ
  •  మోసగాళ్ల వేటలో ముంబై పోలీసులు

నకిలీ ధ్రువపత్రాలతో కోట్ల రూపాయలు విలువచేసే సంస్థ భూమిని అక్రమంగా అమ్మేసారు ముంబైలోని ఓ సంస్థలో పనిచేసే  ఇద్దరు ఉద్యోగులు. ఆ ఇద్ద‌రి ఉద్యోగుల‌పై స‌ద‌రు సంస్థ‌ ముంబై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో ఇద్ద‌రు ఉద్యోగులు ఫిబ్రవరిలో నిహారికా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నుంచి తప్పుకున్నారు. ఆ ఇద్దరు ఉద్యోగులు నకిలీ పత్రాలను సృష్టించి సువిశాలమైన భవన సముదాయాన్ని కశ్మీర్‌కు చెందిన ఐరిస్ హాస్పిటాలిటీకి విక్రయించారని ఆరోపించారు.

వివ‌రాళ్లోకెళితే.. ముంబయికి చెందిన ఒక నిర్మాణ సంస్థలోని ఇద్దరు మాజీ ఉద్యోగులు.. హైదరాబాద్‌లోని పురాతన ప్యాలెస్‌ను దానికి వెనుకవైపు ఉన్న కశ్మీర్ హోటల్‌కు బదిలీ చేశారని ఆరోపించారు. ‘నిహారికా నిర్మాణ సంస్థ’ ముంబై, నేవీ ముంబై అంతటా గృహ, వ్యాపార సముదాయాల భారీ ప్రాజెక్టులను చేపడుతోంది. హైదరాబాద్ లోని ఓ ప్యాలెస్ ను సురేష్ కుమార్, సీ రవీంద్రలు కలిసి కశ్మీర్ కేంద్రంగా ఉన్న ఐరిస్ హాస్పిటాలిటీ యాజమాన్యానికి విక్రయించారని ఆ సంస్థ ముంబై ఆర్థిక నేర విభాగానికి చెందిన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Image result for Nazri bagh palace

హైదర్ గుడాలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న నజ్రిబాగ్ ప్యాలెస్ (కింగ్ కోటి ప్యాలెస్ )ను నిహారిక సంస్థ కొనుగోలు చేసింది. నజ్రి బాగ్ ప్యాలెస్ ట్రస్ట్ నుండి గత మూడు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసింది. ఈ ఏడాది జూన్ నెలలో కింగ్ కోటి ప్యాలెస్ వివరాలు తెలుసుకుందామని సంస్థ అధికారులు హైదరాబాద్ లోని రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులను కలిశారు. ప్యాలెస్ ను ఐరిస్ హాస్పిటాలిటీ యజమానులకు బదిలీ చేశారని తెలిసి నిర్మాణ సంస్థ అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు బయటపడ్డాయి. ఫిబ్రవరిలో ప్యాలెస్ కు వెనుక ఉన్న ఐరిస్ హాస్పిటాలిటీ యాజమన్యం అమీత్ ఆమ్లా, అర్జున్ ఆమ్లాలకు రూ 300 కోట్లకు సురేష్ కుమార్, సీ రవీంద్ర లు విక్రయించారని తేలింది. అనంతరం ఉద్యోగాలనుండి తప్పుకున్నారు. పోలీసులు మాజీ ఉద్యోగులను పట్టుకునేందుకు వేట కొనసాగిస్తుండ‌గా.. నిహారిక సంస్థ మాత్రం తన ఆస్తిని తిరిగి పొందేందుకు న్యాయ పోరాటానికి సిద్ధమైంది.

Image result for Nazri bagh palace

ప్యాలెస్ రిజిస్ట్రేషన్ కు సురేష్ కుమార్, రవీంద్ర లు నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి భవనాన్ని అమ్మారని, ఆ ఇద్దరిపై ఫోర్జరీ, చీటింగ్, క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఆర్ధిక నేర విభాగ పోలీసు అధికారి తెలిపారు. వీరికి సహకరించారని అనుమానిస్తున్న హైదరాబాద్ కు చెందిన మరో వ్యక్తిని విచారిస్తున్నట్లు తెలిపారు.

కింగ్ కోటి ప్యాలెస్ ను కొనుగోలు చేసిన యాజమాన్యాన్ని న్యూస్ పేపర్స్ లోని ఈ-మెయిల్స్, ఫోన్స్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమ్లా బ్రదర్స్ నుండి ఎటువంటి స్పందన లేదు. నిహారిక సంస్థ డైరెక్టర్స్ కూడా దీనిపై నోరు విప్పడం లేదు.

Image result for Nazri bagh palace

హైదరాబాద్ చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క చివరి నివాసం ‘కింగ్ కోటి ప్యాలెస్’. నిజాం 1967లో ఇక్కడే తుది శ్వాస విడిచాడు. దీని విస్తీర్ణం 2.5 లక్షల చదరపు అడుగులుంటుంది. ఇది భారతదేశంలోకి ప్రవేశించడానికి ముందు హైదరాబాద్ చివరి నిజాం చివరి నివాసం కూడా ఇదే.

దివంగత ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ కమల్ ఖాన్ నుంచి ఈ ప్యాలెస్ ను నిజాం కొనుగోలు చేశాడు. ప్యాలెస్ గోడలలో ఒకదానిపై పెద్ద మోనోగ్రామ్ ‘కెకె’ ఉండేలా తీర్చిదిద్దారు. నిజాం దాని పేరును నజ్రీ బాగ్ నుండి కింగ్ కోటిగా మార్చారు. అసలు కెకె అనే చిహ్నం కమల్ ఖాన్ కు నిదర్శనం.

Image result for niharika real estate company Nazri bagh palace Incident

ప్యాలెస్ ప్రధాన ద్వారాన్ని ‘పర్దా గేట్’ అని పిలుస్తారు. నిజాం చాలా సంవత్సరాల క్రితం ప్యాలెస్ ను విడిచినా భవనం ఇప్పటికీ పరదాలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే ఆర్కిటెక్ట్ కళాత్మకతకు ఇది ఒక మైలురాయిగా నిలిచింది.

ప్యాలెస్ యొక్క ప్రధాన ద్వారాన్ని ‘పర్దా గేట్’ అని పిలుస్తారు, ఇది ఒక మైలురాయి. చివరి నిజాం చాలా సంవత్సరాల క్రితం ప్యాలెస్ నుండి బయలుదేరినప్పటికీ.. ఇది ఎల్లప్పుడూ పరదాలో ఉంటుంది.

కింగ్ కోటి కాంప్లెక్స్ లోని మూడు భవనాలలో ప్రధాన భవనంలో ప్రస్తుతం ఆసుపత్రి ఉంది. ముబారక్ మాన్షన్ (నజ్రీ బాగ్) నిజాం యొక్క ప్రైవేట్ ఎస్టేట్స్ (సర్ఫ్-ఇ-ఖాస్) కార్యాలయాలు ఉన్నాయి. అయితే 1980లో మూడవ భవనం ఉస్మాన్ మాన్షన్ కూల్చి దాని స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆసుపత్రి భవనాన్ని నిర్మించింది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort