హైదరాబాద్‌: సికింద్రబాద్‌ రైల్వేస్టేషన్‌లో రెండేళ్ల బాలిక కిడ్నాప్‌ అయ్యింది. నెల్లూరులోని తన్ స్వస్థలానికి వెళ్లేందుకు సురేష్‌ అనే వ్యక్తి తన తన కుమారుడు ప్రభాస్‌ (5), కూతురు స్వర్ణలత (2)తో కలిసి ఆదివారం సాయంత్రం రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. ఈ నేపథ్యంలో సురేష్‌ తన పిల్లలతో కలిసి రైల్వేస్టేషన్‌లోనే నిద్రించాడు. కాగా సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో సురేష్‌ మేల్కొని చూడగా కూతురు స్వర్ణలత కనిపించలేదు. దీంతో సురేష్‌ వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా.. ఓ వ్యక్తి చిన్నారిని కిడ్నాప్‌ చేసినట్లుగా గుర్తించారు. చిన్నారి స్వర్ణలత ఆచూకీని గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.