'ఖిలాడి'గా మారిన రవితేజ.. టాప్ టు బాటమ్ బ్లాక్ తో చంపేశాడుగా..!

By సుభాష్  Published on  18 Oct 2020 6:09 AM GMT
ఖిలాడిగా మారిన రవితేజ.. టాప్ టు బాటమ్ బ్లాక్ తో చంపేశాడుగా..!

మాస్ మహరాజా రవితేజ అభిమానులకు పండుగే. రవితేజ 67వ చిత్రానికి సంబంధించి టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాకి 'ఖిలాడి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. రాక్షసుడు లాంటి సైకో థ్రిల్లర్ కి దర్శకత్వం వహించిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. టాప్ టు బాటమ్ బ్లాక్ లో రవితేజ లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ చూస్తుంటే మాస్ రాజా వయసు చాలా తగ్గినట్టుగా.. టీనేజ్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఈ మూవీ కూడా మైండ్ గేమ్ నేపథ్యంలో థ్రిల్లర్ తరహా కథాంశంతో తెరకెక్కనుందిట.

రాక్షసుడు నిర్మాత సత్యనారాయణ కొనేరు ఈ ఈ యాక్షన్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. లూసిఫెర్ ఫేమ్ సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేస్తారు. ఈ శనివారం సినిమా మొదలైంది. వచ్చే నెల నుండి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. చాలా కాలంగా సరైన బంపర్ హిట్టు లేక సతమతమవుతున్న రవితేజకు బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్న కసితో పని చేస్తున్నాడట దర్శకుడు. ఎ స్టూడియోస్ సహకారంతో పెన్ స్టూడియోస్ - హవిష్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రవితేజ డ్యుయల్‌ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story