బిగ్‌బాస్‌ -4 : గెస్ట్‌ హోస్ట్‌గా రోజా..?

By సుభాష్  Published on  17 Oct 2020 7:52 AM GMT
బిగ్‌బాస్‌ -4 : గెస్ట్‌ హోస్ట్‌గా రోజా..?

తెలుగులో స్టార్‌ మాలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ -4కు హోస్టుగా నాగార్జున చేస్తున్నవిషయం తెలిసిందే. ఈ షోలో పెద్దగా తెలిసిన సెలబ్రెటీలు లేకపోయినా.. తన టైమింగ్‌, పంచ్‌లతో షోను అదరగొడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో గెస్ట్ హోస్ట్ రాబోతున్నారు అంటూ గత వారం చాలా బలంగా పుకార్లు షికార్లు చేశాయి. 'వైల్డ్ డాగ్' సినిమా షూటింగ్ కోసం నాగార్జున విదేశాలకు వెళ్లారని ఆయన ఒక్క రోజు షూటింగ్ కోసం తిరిగి రావడం చాలా రిస్క్ తో కూడుకున్న పని కనుక ఈ వారంకు సంబంధించి వీకెండ్ ఎపిసోడ్స్ ను గెస్ట్ హోస్ట్ తో ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తీరా చూస్తే పోయిన వారం వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జుననే కనిపించాడు. దాంతో పుకార్లన్నింటికి చెక్ పెట్టినట్లయ్యింది.

అయితే.. ఈ వారం ఖచ్చితంగా గెస్ట్‌ హోస్ట్‌ రానున్నారనే వార్తలు ఇంకాస్త బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే నాగార్జున ప్రస్తుతం సినిమా షూటింగ్‌ కోసం మనాలీలో ఉన్నారు. అక్కడి నుంచి ఒక్క రోజు షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ రావడం కష్టం అని ఈ సారి ఖచ్చితంగా గెస్ట్‌ హోస్ట్ ను చూడబోతున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఈ సారి గెస్ట్‌హోస్ట్‌గా రమ్యకృష్ణ కాదని.. రోజా రానున్నారని అంటున్నారు. నేడు రెండు ఎపిసోడ్స్‌కు సంబంధించిన షూటింగ్‌ జరగనుంది. మరి కాసేపట్లో ప్రోమో వచ్చే అవకాశం ఉంది. కనుక గెస్ట్ హోస్ట్ వార్తలు నిజమేనా..? రోజా గారు హోస్ట్ గా దుమ్ము లేపబోతున్నారా..? లేదంటే గత వారం మాదిరిగానే పుకార్లేనా అనే విషయం మరికాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా.. బిగ్ బాస్ గత సీజన్ లో ఒక వీకెండ్ లో నాగార్జున అందుబాటులో లేక పోవడం వల్ల రమ్యకృష్ణ గెస్ట్ హోస్ట్ గా వచ్చి సందడి చేసిన విషయం తెల్సిందే. ఆమె గెస్ట్ గా వచ్చని ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Next Story