'కేజీఎప్‌2' రిలీజ్ డేట్ కన్ఫర్మ్..

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 13 March 2020 6:56 PM IST

కేజీఎప్‌2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్..

కన్నడ సినిమాగా విడుదలై పాన్‌ ఇండియా సినిమాగా భారీ విజయాన్ని అందుకుంది కేజీఎప్‌-చాప్టర్‌ 1 చిత్రం. ఈ చిత్రం అప్పట్లో ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిందే. బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు, హీరో యశ్‌ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా కెజిఎఫ్ 2 విడుదల తేదీ కన్ఫర్మ్‌ అయిపోయింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా పండగ రోజు(అక్టోబర్‌ 23న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓకేసారి అయిదు బాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలైలో విడుదల చేద్దామని భావించారు. కాగా, సినిమా చిత్రీకరణ విషయంలో ఎక్కడా రాజీపడకుండా సన్నివేశాలను తెరకెక్కించడం, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల కారణంగా ఆలస్యం అవుతోంది.

కేజీఎఫ్ చిత్ర తొలిభాగం రూ.230కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. దీంతో రెండో భాగం కోసమని అన్ని ఇండస్ట్రీల‌ నుంచి భారీ పోటీ ఉంది. దాంతో బిజినెస్ విషయంలో ఈ చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పార్ట్ 2 బిజినెస్ ఇప్పుడే పూర్తి చేయకూడదని వాళ్లు ఫిక్స్ అయిపోయారు. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత గానీ అసలు బిజినెస్ మొదలుపెట్టాలి అని ఆలోచిస్తున్నారట దర్శక నిర్మాతలు.

KGF chapter 2 will release on october

తెలుగులో కెజియఫ్ తొలిభాగాన్ని 4 కోట్లకు తీసుకుంటే 13 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తమిళనాట కూడా 10 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక హిందీలో 40 కోట్ల వరకు రాబట్టింది. దాంతో రెండో భాగానికి భారీ ఆఫర్స్ వస్తున్నా కానీ నిర్మాతలు మాత్రం అస్సలు టెంప్ట్ కావడం లేదు.

ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ప్రతినాయకుడు అధీర పాత్రలో కనిపించనున్నాడు. ప్రధానిగా రవీనా టాండనఖ నటిస్తుండగా.. ఓ కీలకపాత్రలో తెలుగు నటుడు రావు రమేష్ నటిస్తున్నారు.

గరుడను చంపడానికి కేజీఎప్‌లోకి అడుగుపెట్టిన రాఖీ ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు..? కేజీఎప్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్‌, కమల్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు..? తన తమ్ముడి మరణవార్త తెలిసిన అధీర ఏం చేశాడు..? గరుడ చనిపోయాడన్న వార్త తెలిసి ఇనాయత్‌ ఖలి దేశంపై దండెత్తడానికి ఎలాంటి ప్రణాళికలు వేశాడు..? కేజీఎప్‌ను దక్కించుకున్న రాఖీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఏం చేసింది..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు కేజీఎప్‌2లో సమాధానం లభించనుంది.



Next Story