మాకు కేఎఫ్ సీ చికెన్ కావాలి : గాంధీలో కరోనా బాధితులు

By రాణి  Published on  5 March 2020 5:42 AM GMT
మాకు కేఎఫ్ సీ చికెన్ కావాలి : గాంధీలో కరోనా బాధితులు

ఒక పక్క తెలుగు రాష్ర్టాల్లో కరోనా అనుమానితులుండటంతో..అందరూ ఆందోళన చెందుతుంటే..మరో పక్క కరోనా అనుమానితులు, బాధితులు తమకు ఇష్టమైన ఆహారం పెట్టాలంటూ డాక్టర్లను వేడుకుంటున్నారు. కరోనా వైరస్ సోకితే బ్రతకడం కష్టమని పుకార్లొస్తున్న నేపథ్యంలో..కరోనా నిర్థారణ అయినవారు, అనుమానితులు ఇక తమకివే ఆఖరి రోజులనుకుంటున్నారు. అందుకే వైరస్ పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారు, కరోనా అనుమానంతో అక్కడే ఉన్నవారు తమకు నచ్చిన ఆహారం అందించాలని కోరుతున్నారు.

మామూలుగా గాంధీ ఆస్పత్రిలో పేషంట్లకు అక్కడున్న మెనూ ప్రకారమే ఆహారం పెడతారు. కానీ..ఐసోలేషన్ వార్డులో ఉన్న కొందరికి ఈ ఆహారం అస్సలు రుచించడం లేదంట. ఇటీవల కరోనా అనుమానంతో ఒకరోజంతా గాంధీలో ఉన్న ఇద్దరు చైనీయులు తమకు కేఎఫ్ సీ చికెన్ తెప్పించాలని కోరారట. మరికొందరైతే..ఆస్పత్రిలో పెట్టే ఫుడ్ నచ్చకపోతే..వారే ఫుడ్ యాప్ ల ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారట. ఇలా వచ్చే ఆర్డర్లను డెలివరీ బాయ్ లు హెల్ప్ డెస్క్ వద్దకు చేర్చగా..అక్కడి నుంచి సిబ్బంది ఆ ఆహారాన్ని ఐసోలేషన్ వార్డుకు చేర్చుతున్నారట. అలాగే దగ్గు, జలుబు వంటి లక్షణాలతో ఆస్పత్రిలో ఉన్నవారికి సిబ్బంది మానవతా దృక్పథంతో తమకు నచ్చిన ఆహారం తినేందుకు అనుమతిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.

Next Story