కేరళ 'సైనేడ్' కిల్లర్ జాలి..!ఈమెకు చంపడం హాబీ..!
By Newsmeter.Network Published on 9 Oct 2019 8:40 PM IST
తిరువనంతపురం: ఆమె అంటేనే ఇప్పుడు కేరళనే కాదు..దేశం మొత్తం హడలి పోతుంది. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఘటన ఇప్పుడు క్రైం వార్తల్లోనే కాదు..అన్ని న్యూస్‌లోనూ టాప్‌గా నిలిచింది. దశాబ్దకాలంలో ఆరుగురు కుటుంబ సభ్యులను చంపేసింది. అదీ..సైనేడ్‌తో. ఎవరికీ డౌట్ రాకుండా చంపేసింది. చివరకు ఇంట్లో వాళ్లకు కూడా డౌట్ రాలేదు. మనసులో అనుకుందంటే చంపేస్తది అంతే...!. ఈ 'జాలి'కి జాలి,దయ, ప్రేమ ఏం లేవు. ఉన్నదల్లా ద్వేషం. ఎందుకో ఆ ద్వేషం అర్ధం కాక మానసిక నిపుణులు, పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. అయితే..పోలీసులు జాలిని ప్రశ్నిస్తున్నప్పుడు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
జాలికి ఆడ పిల్లలంటే పడదట..!. ఇది ఎందుకో పోలీసులకు అర్టం కావడంలేదు. ఆమెకు మరిన్ని ప్రశ్నలు వేస్తుంది సిట్. భర్త సోదరి కుమార్తె ఆల్ఫాన్స్‌తో హత్యల సీరియల్ మొదలు పెట్టింది జాలి. అందరిని సైనేడ్‌తోనే చంపింది. ఆహారంలో కలిపి మరీ చంపింది. వారు అన్నం తింటుంటే చూసి ఆనందపడేది. ఎందకంటే వారి ప్రాణాలు పోతాయని అట..!. జాలికి కఠిన శిక్ష పడే అవకాశముందని కేరళ పోలీసులు చెబుతున్నారు. క్రైంకే క్రైం కోజికోడ్ జాలి అంటున్నారు పోలీసులు.