గవర్నర్‌కు కరోనా పాజిటివ్‌

By సుభాష్  Published on  8 Nov 2020 3:25 AM GMT
గవర్నర్‌కు కరోనా పాజిటివ్‌

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. మళ్లీ మెల్ల మెల్లగా పెరుగుతూ వస్తోంది. ఈ కరోనా సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. మరో వైపు కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా కూడా రెట్టింపు అవుతోంది. తాజాగా కేరళ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

గత వారం న్యూఢిల్లీలో తన తో సన్నిహితంగా ఉన్నవారందరిని కోవిడ్‌ పరీక్షులు చేయించుకోవాలని గవర్నర్‌ కోరారు. ఈ మేరకు ట్వీట్టర్‌ వేదికగా వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.Next Story
Share it