కేరళలో కొత్తగా 4,138 పాజిటివ్‌ కేసులు.. 21 మంది మృతి

By సుభాష్  Published on  2 Nov 2020 3:23 PM GMT
కేరళలో కొత్తగా 4,138 పాజిటివ్‌ కేసులు.. 21 మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక కేరళ రాష్ట్రంలో ప్రతి రోజు వేలల్లో కేసులు నమోదు కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు కొత్తగా 4,138 పాజిటివ కేసులు నమోదైనట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే కొత్త కేసులకు సమానంగా రివకరీ రేటు కూడా ఉండటంతో కొంత ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,198 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక కొత్తగా 21 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కేరళ రాష్ట్రంలో మరణాల రేటు 0.34 శాతం ఉంది.

కాగా, కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. ఈ వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌తో పాటు ఇతర దేశాలు కూడా తవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్ని దేశాల వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో కొనసాగుతున్నాయి. ఇక భారత్‌ బయోటెక్‌కు చెందిన వ్యాక్సిన్‌ మార్చి వరకు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి వస్తుందనుకుంటున్నా.. కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. కరోనా కట్టడికి భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించడం లాంటివి వల్ల రక్షించుకోవచ్చని ఇప్పటికే వైద్యులు, నిపుణులు సూచించారు. వ్యాక్సిన్‌ లేని కారణంగా ఇదే సరైన మార్గమని సూచిస్తున్నారు.

Next Story