ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి ఉంది. ముఖ్యంగా ఇటీవలే ఆమోదం పొందిన సీఏఏ ప్రభావం ఇక్కడ అధికంగా ఉంది. ఢిల్లీ ప్రజలు దాదాపుగా సీఏఏకు వ్యతిరేకంగానే ఉన్నారు. దీంతో గెలుపు ఆప్ సొంతమయింది. అయితే ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. అదేమిటంటే..కేజ్రీవాల్ భార్య సునీత పుట్టినరోజు. ఫలితాలు వెలువడిన రోజే ఆమె పుట్టినరోజు కావడం విశేషమే కదా మరి. దీంతో నెటిజన్లు సునీతకు పెద్దఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మళ్లీ ఆమె పుట్టినరోజు నాడే విజయం సాధిస్తున్నారని, సునీతే అదృష్ట దేవత అని కామెంట్లు చేస్తున్నారు.

‘మీరే మా హీరో వెనకున్న శక్తి. ఆయన్ను ముందుకు నడిపించినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్లు చేస్తున్నారు. అలాగే కేజ్రీవాల్ కుమారుడు తన మొదటి ఓటును ఈ ఎన్నికల్లోనే వేయడం మరో విశేషం. కొడుకు మొదటిసారి ఓటు వేసిన ఎన్నికల ఫలితాలు భార్య పుట్టినరోజు రావడం..ఆప్ విజయం సాధించడం కేజ్రీవాల్ కు జీవితంలో మరపురాని విజయం అనే చెప్పాలి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.