మహానటికి మహేష్‌ స్పెషల్ విషెస్‌

By సుభాష్  Published on  17 Oct 2020 11:30 AM IST
మహానటికి మహేష్‌ స్పెషల్ విషెస్‌

కీర్తి సురేష్‌ పేరు వినగానే 'మహానటి' చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో తన సత్తా చాటి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు పొందింది. నేడు కీర్తి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కీర్తి 28వ పుట్టిన రోజు సందర్భంగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ఆమెకు స్పెషల్ విషెస్‌ చెప్పారు.

‘టాలెంటెడ్‌ కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సర్కార్‌ వారి పాట’ టీం మీకు ఫారెన్‌ వెళ్లడానికి స్వాగతం పలుకుతోంది. కచ్ఛితంగా ఈ సినిమా మీ జీవితంలో ఒక మంచి గుర్తుగా మిగిలిపోతుంది’ అని మహేష్‌ బాబు ట్వీట్‌ చేశారు. మహేష్‌ బాబు నటిస్తున్న ‘సర్కార్‌ వారి పాట’ చిత్రంలో కీర్తి నటిస్తున్న సంగతి తెలిసిందే.

2000 సంవత్సరంలో మలయాళ చిత్రంలో బాలనటిగా పరిచయం అయ్యింది కీర్తి. తరువాత బాలనటిగా కొన్ని సినిమాలు చేసింది. ఫాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన తరువాత తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. 2013లో మలయాళంలో వచ్చిన 'గీతాంజలి' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. కాగా.. 2016లో తెలుగులో 'నేను శైలజ' టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఈ సినిమా డీసెంట్ హిట్ కావడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమా ఆమెకు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ప్రస్తుతం కీర్తి.. "సర్కారు వారి పాట" సినిమాలో మహేష్ సరసన నటిస్తోంది.



Next Story