నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్.పి.ఆర్.), నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజెన్స్(ఎన్.ఆర్.సి) లపై మీ వైఖరేంటో స్పష్టంగా తెలియజేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని హైదరాబాద్ కు చెందిన మహిళలు కోరారు. ఎన్.ఆర్.సి కి వ్యతిరేకంగా గళమెత్తిన వీరంతా ఎన్.ఆర్.సి., ఎన్.పి.ఆర్. లపై తెలంగాణ ప్రభుత్వ వైఖరేంటో స్పష్టంగా తెలియజేయాలని కోరారు.

విమెన్స్ అలియన్స్ ఎగెనెస్ట్ ఎన్.పి.ఆర్. బృందానికి చెందిన సభ్యులు మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రభుత్వం కూడా పొలిటికల్ ఒత్తిడులకు తలొగ్గిందా..?’ అని ప్రశ్నిస్తున్నారు. కేరళ, వెస్ట్ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్.ఆర్.సి., ఎన్.పి.ఆర్. లకు వ్యతిరేకమని స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎన్.ఆర్.సి., ఎన్.పి.ఆర్.లకు తాము వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి చెప్పాలని కోరారు.

జస్వీన్ జైరత్ మాట్లాడుతూ సిఏఏకు తాము వ్యతిరేఖమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే స్పష్టమైన వైఖరిని తెలియజేశారని.. అలాగే ఎన్.ఆర్.సి., ఎన్.పి.ఆర్.లకు కూడా తాము వ్యతిరేకమని కేసీఆర్ చెప్పాలని జస్వీన్ కోరారు.ఎన్.ఆర్.సి.ని దొడ్డిదారిలో అమలుపరచడానికి చేస్తున్న కుట్రనే ఎన్.ఆర్.సి. జస్వీన్ ఆరోపించారు. పౌరుల హక్కులను హరించడం కోసమే ఎన్.ఆర్.సి., ఎన్.పి.ఆర్.లను తీసుకొని వస్తున్నారన్నారు. ఎన్.ఆర్.సి., ఎన్.పి.ఆర్.లకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలను దిగుతున్న చాలా మందిపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. పోలీసులు ఆ కేసులను ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్.ఆర్.సి., ఎన్.పి.ఆర్.లను ప్రజలు పూర్తిగా తిప్పికొట్టే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని వారు చెబుతున్నారు. ఎన్.పి.ఆర్. డేటాను ఎన్.ఆర్.సి. కోసం ఉపయోగిస్తారని రమా మెల్కొటే చెబుతున్నారు. ఎన్.పి.ఆర్. నుండి కలెక్ట్ చేసిన డేటాను ఎన్.ఆర్.సి. కోసం వాడుతారని.. ప్రజలను కులం, రంగు, మతం, జెండర్ ల ఆధారంగా విడదీసే పన్నాగమని రమా అంటున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.