యశోదలో సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Jan 2020 4:30 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేఫథ్యంలో.. ఎర్రవల్లి ఫాంహౌస్ వేదికగా పార్టీ గెలుపుకై వ్యూహరచన చేస్తున్న తరుణంలో సీఎం స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.
అయితే.. ఎర్రవల్లి నుండి సాయంత్రం 6:30గంటలకు నేరుగా ప్రగతి భవన్ చేరుకున్న కేసీఆర్.. అక్కడినుండి చికిత్సకై సోమాజీగూడ యశోద ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. డాక్టర్లు అక్కడ సీఎం కేసీఆర్‌కు 3గంటలు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తుంది. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ ఆసుపత్రి నుండి ప్రగతి భవన్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ విషయమై సీఎం కేసీఆర్.. జ్వరం, శ్వాసకోస ఇబ్బందులతో బాధ పడుతున్న కారణంగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లారని సీఎంవో వర్గాలు తెలిపాయి.