రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు విందు.. కేసీఆర్‌కు ఆహ్వానం

By సుభాష్
Published on : 22 Feb 2020 12:55 PM IST

రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు విందు.. కేసీఆర్‌కు ఆహ్వానం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భార్యట పర్యటనలో భాగంగా ఈనెల 24, 25వ తేదీలో భారల్‌లో పర్యటించనున్నారు. కాగా, ట్రంప్‌ పర్యటన సందర్భంగా ఢిల్లీతోపాటు అహ్మదాబాద్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈనెల 25న రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన అవకాశం లభించింది. ట్రంప్‌ విందుకు కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఇక రాష్ట్రపతి నుంచి ఆహ్వానాలు అందిన రాష్ట్రాలు చూస్తే.. తెలంగాణ, కర్ణాటక, బీహార్‌, అసోం, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా ఉన్నాయి. రాష్ట్రపతి ఆహ్వానం మేరకు కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. విందు అనంతరం ట్రంప్ అదే రాత్రి 10 గంటలకు తిరిగి అమెరికాకు బయలుదేరుతారు.

Next Story