ఆర్టీసీ సమ్మె: డీజీపీకి కేసీఆర్‌ అందుకే ఫోన్‌ చేశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Oct 2019 1:20 PM GMT
ఆర్టీసీ సమ్మె: డీజీపీకి కేసీఆర్‌ అందుకే ఫోన్‌ చేశారా..?

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. ప్రతీ ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టాలని డీజీపీకి సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. బస్టాండ్లు, డిపోల వద్ద మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించాలని సూచించారు. ఇంటెలిజెన్స్‌ పోలీసులను కూడా ఉపయోగించుకోవాలన్నారు.

ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, బస్సులను ఆపేవారిని, ఇతర చట్టవ్యతిరేక కార్యక్రమాలపాల్పడే వారిని గుర్తించి..వారి కేసులు పెట్టి కోర్టుకు పంపాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి కేసీఆర్‌ తెలిపారు. ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు నడుస్తాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Next Story