కాశ్మీర్ లో ప్రేమికులకు ఎంత కష్టమొచ్చిందో..!

By రాణి  Published on  20 Feb 2020 9:31 AM GMT
కాశ్మీర్ లో ప్రేమికులకు ఎంత కష్టమొచ్చిందో..!

ఇంటర్నెట్ కు మన వాళ్ళు ఎంతగా బానిస అయ్యారో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొద్ది సేపు డేటా అందుబాటులో లేందంటే.. ఏ ఎడారి ప్రాంతంలోనో ఉన్నామన్న భ్రమల్లోకి వెళ్ళిపోతారు. ఇక ప్రేమ పావురాల విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి.. ఎందుకంటే ఉదయాన గుడ్ మార్నింగ్ మెసేజీల నుండి రాత్రి వాట్సప్ లో గుడ్ నైట్ చెప్పుకునే దాకా ఎన్నో విషయాలు ఇంటర్నెట్ తో ముడిపడి ఉంటాయి. మధ్యలో ఫోటోల షేరింగ్, వీడియో కాల్స్ తప్పనిసరి. ఇలా ప్రేమికుల జీవితాల్లో ఇంటర్నెట్ అన్నది ముఖ్యమైపోయింది.

కాశ్మీర్ లోని ప్రేమికులు పాపం ఇంటర్నెట్ లేక ఎంతగానో బాధపడిపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రేమలు చిగురిస్తున్న ఈ కాలంలో తమ ప్రేయసి/ప్రియుడితో మాట్లాడంటే ఏదొక సామాజిక మాధ్యమంతోనే ముడిపడి ఉంటుంది. ఇంటర్నెట్ లేకుంటే ఏ సోషల్ మీడియా అకౌంట్ కూడా పని చేయదు. ఆగస్టు 5, 2019న జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసింది భారత ప్రభుత్వం. అప్పటి నుండి ఇంటర్నెట్ ను నిలిపివేసింది. దీంతో ప్రేమికులు చాలా కష్టాలు పడ్డారు. ప్రపంచంలోనే 'సెకండ్ మోస్ట్ రొమాంటిక్ ప్లేస్' గా పిలవబడే కాశ్మీర్ లో రొమాంటిక్ కపుల్స్ కు ఇంటర్నెట్ ను బంద్ చేయడం చాలా ఇబ్బందిగా మారింది. ఇంటర్నెట్ లేకపోవడంతో తాము ప్రేమించిన వారితో చాట్ చేయడానికి విపిఎన్(వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్) ను ఉపయోగించుకున్నారు. విపిఎన్ ను వాడడం కారణంగా ఇంటర్నెట్ ను ఇతర దేశాల సర్వర్ నుండి యాక్సెస్ చేయొచ్చు. సాధారణంగా కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో తీవ్రవాదులు ఇలా విపిఎన్ ను యాక్సెస్ చేసి తమ టీమ్ కు మెసేజీలు పంపుతూ ఉంటారు.

దీంతో ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించిన జమ్మూ కాశ్మీర్ పోలీసులు విపిఎన్ ను వాడుతున్న వాళ్ళను, డౌన్ లోడ్ చేసిన వారి లిస్టును తయారు చేసి విచారించగా.. వారిలో చాలా మంది ప్రేమికులే అని తేలింది. తాము ప్రేమిస్తున్న వారితో ఫోన్ లో రొమాన్స్ చేయడానికి ఇలా మొబైల్ లో విపిఎన్ ను ఉపయోగించారు. విపిఎన్ ను వాడి సోషల్ మీడియాను యాక్సెస్ చేసిన వారిలో ఇప్పటిదాకా 200 మందిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. ఆగస్టు 5 తర్వాత తమ ప్రేయసిలతో టచ్ లో ఉండలేక డిప్రెషన్ లోకి వెళ్లిన చాలా మంది అబ్బాయిలు ఇలా విపిఎన్ లు వాడారట. విపిఎన్ డౌన్లోడ్ చేసిన కొందరు యువకుల ఫోన్లను పోలీసులు పరిశీలించగా అందులో అమ్మాయిలతో చేసిన ఛాటింగ్, ఫోటోలు బయటపడ్డాయి. వారిని విచారించగా తమ గర్ల్ ఫ్రెండ్స్ తో మాట్లాడడానికే విపిఎన్ లను డౌన్లోడ్ చేసుకున్నామని.. దయచేసి విడిచిపెట్టండి అంటూ పోలీసులతో వేడుకున్నారట..!

Next Story